Featured

Prathyusha Garimella : నన్ను డిస్టర్బ్ చేయొద్దు… వాచ్ మెన్ తో చివరిసారిగా ప్రత్యూష అన్న మాటలు…!

Prathyusha Garimella : ఫ్యాషన్ ప్రపంచంలో డిప్రెషన్, ఒంటరితనం ఎంతోమంది సెలబ్రిటీలను ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది. ఈ పోటీ ప్రపంచంలో తాము అనుకున్న లక్ష్యాన్ని చేరలేని చాలా మంది యువత పిరికితనంతో చావును ఆశ్రయిస్తున్నారు. శనివారం రాత్రి ఇలాంటి ఒక దుర్ఘటనే జరిగింది. ఫ్యాషన్ డిజైనర్ గా ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్ హీరో హీరోయిన్లకు బట్టలు డిజైన్ చేసిన ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్యకి పాల్పడింది.

తల్లిదండ్రులకు భారం కాకూడదని….

శనివారం రాత్రి బోటిక్ నుండి ఇంటికి వచ్చిన ప్రత్యూష, బాత్ రూమ్ లో విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం 4 గంటల సమయంలో వాచ్ మాన్ భార్య దుర్గ ఏమైనా కావాలా అని అడుగగా ఏమైనా కావాలంటే పిలుస్తాను.. అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తలుపులు వేసుకున్న ప్రత్యూష రాత్రి మళ్ళీ 9 గంటల సమయంలో తలుపులు కొట్టినా తీయలేదని, లైట్లు కూడా వేసుకోలేదని తలుపు కొట్టమని దుర్గ చెప్పింది. ఇక ఉదయం 6 గంటల సమయంలో మరోసారి తలుపు కొట్టినా ఎటువంటి స్పందన రాలేదు.

ఇక ప్రత్యూష తండ్రి తో కలిసి దుర్గ భర్త తలుపులు తెరిచి చూస్తే బాత్ రూంలో విగత జీవిగా కనిపించిందని దుర్గ తెలిపారు. అధిక మోతాదు లో కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలుస్తోంది. మొదట అనుమానస్పద మృతిగా భావించిన పోలీసులు ఇంట్లో సుసైడ్ నోట్ ను గుర్తించారు. అందులో తల్లిదండ్రులకు భారం కాకూడదనే, ఒంటరితనం భరించలేక చనిపోతున్నట్లు క్షమించమని తల్లిదండ్రులను రాసింది. ప్రస్తుతం ప్రత్యూష మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించే పనిలో పోలీసులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటెజ్ కూడా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు తరువాత అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago