Pradeep Ranganathan: కొందరు సెలబ్రిటీలు కేవలం ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీలుగా మారిపోతూ ఉంటారు. ఒక్క సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ ఒకరు.కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈయన లవ్ టుడే సినిమాలో హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు.ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో సుమారు 50 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టే సంచలనం సృష్టించింది.
ఇక ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు విడుదల చేసి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల సమయంలో నటుడు ప్రదీప్ రంగనాథన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల గురించి ప్రస్తావించడంతో కొంత పాటి వివాదాలను ఎదుర్కొన్నారు. అయితే ఈయన ఈ విషయంపై స్పందించి వివరణ ఇవ్వడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త సైలెంట్ అయ్యారు.
తాజాగా నటుడు ప్రదీప్ రంగనాథన్ మరోసారి సూపర్ స్టార్ అభిమానులను గెలికి భారీగా ట్రోల్ అవుతున్నారు.లవ్ టుడే సినిమా మంచి హిట్ అందుకోవడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ నటుడు ప్రదీప్ కు సన్మానం చేశారు. దీంతో చాలామంది ఈయన దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు చేయడమే కాకుండా మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు.
కొంతమంది ఆ సినిమాకు ‘‘జాయింట్ జగదీశన్’’ అనే టైటిల్ కూడా పెట్టేశారు. ఈ సినిమా పోస్టర్ తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.కట్ చేస్తే, ఆ పోస్టర్లకు ప్రదీప్ లైక్ కొట్టాడు. ఆ పోస్టర్లతో పాటు ‘‘రజినీ కాంత్ ఫ్యాన్స్ పిచ్చివాళ్లు’’ అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అయితే రజనీకాంత్ ఫ్యాన్స్ పిచ్చివాళ్లు అనే వ్యాఖ్యలు ఉన్నటువంటి పోస్టర్ కు ఈయన లైక్ కొట్టడంతో సూపర్ స్టార్ అభిమానులు దారుణంగా నటుడు ప్రదీప్ రంగనాథన్ ను భారీగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై ప్రదీప్ స్పందన ఏవిధంగా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…