తెలుగు ప్రేక్షకుల్లో నటి ప్రగతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తల్లి పాత్రల్లో, వదిన పాత్రల్లో పలు సినిమాల్లో తన మార్క్ నటనతో అందరిని మెప్పించింది ప్రగతి. సపోర్టింగ్ క్యారెక్టర్లతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి వందలాది సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తెలుగులో ఒక స్టార్ కమిడియన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ టాలీవుడ్ స్టార్ కమిడియన్ తనతో మిస్ బెహేవ్ చేసాడని, చాలా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఆ కమిడియన్ పేరు బయటకి చెప్పకుండా అతను చాలా ఎక్స్ట్రాలు చేసాడు అంటూ తనకు జరిగిన సంఘటనను బయటపెట్టింది. ఆ సమయంలో అతడు ఓక పెద్ద స్టార్ కమిడియన్ అని, ఏడాదికి సుమారు 20 నుంచి 30 సినిమాలు చేస్తుండేవాడిని తెలిపింది ప్రగతి. ఒక షూటింగ్ లో అతనితో కలిసి నటిస్తున్న సమయంలో చాలా ఇబ్బంది పెట్టాడని, పదేపదే తనతో మాటాడేందుకు ప్రయతించాడని, తనను ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది. అతని చేష్టలు తనను చాలా ఇబ్బందికి గురించేశాయని, అందుకే ఆ విషయం ఎక్కువ దూరం వెళ్లకుండా అప్పుడే అతనితో మాట్లాడి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చానని చెప్పింది.
ఒకరోజు షూటింగ్ అయిపోయిన వేంటనే క్యారీవ్యాన్ లోకి తీసుకెళ్లి మీ మాటలు, మీరు చేసే పనులు బాగోలేదని, అవి నన్ను తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తున్నాయి, మీ ప్రవర్తన అస్సలు బాగోలేదు. మీ ప్రవర్తన మార్చుకోకపోతే బాగోదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. ఇక ఆరోజు నుంచి అతను సైలెంట్ అయిపోయాడని, ఆ తరువాత ఎప్పుడు తనతో తప్పుగా ప్రవర్తించలేదని చెప్పింది. తాను ఇచ్చిన వార్నింగ్ బాగానే పని చేసిందని చెప్పుకొచ్చింది ప్రగతి. మరి ప్రగతిని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ కమిడియన్ పేరు మాత్రం చెప్పలేదు… ఎవరో మరి..?
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…