Pragathi: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా మహిళలు కూడా ఎన్నో సాహసాలు చేస్తూ పురుషులకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు తామేమి తక్కువ కాదు అంటూ నిరూపించుకుంటూ ఉన్నారు తాజాగా నటి ప్రగతి సైతం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం 48 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ప్రగతి ఫిట్నెస్ విషయంలో మాత్రం కుర్రాళ్లక గట్టి పోటి ఇస్తున్నారని చెప్పాలి.
ఒంగోలుకు చెందిన ప్రగతి తొలుత మోడలింగ్ చేశారు. ప్రఖ్యాత మైసూర్ సిల్క్ ప్యాలెస్ సహా పలు టాప్ బ్రాండ్స్‌కు మోడల్‌గా వ్యవహరించారు. అనంతరం సినిమాలలో అడుగుపెట్టిన ప్రగతికి కోలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా అవకాశం వచ్చింది. ఇలా హీరోయిన్గా అడుగుపెట్టిన ఈమె కొన్ని కారణాల వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు.
ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో తల్లి అత్త పిన్ని పాత్రలలో నటిస్తూ ఈమె మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తల్లిపాత్ర అంటేనే ముందుగా దర్శక నిర్మాతలకు ప్రగతి గుర్తుకు వచ్చేది అంతలా ఈమె తన పాత్రలను పండించేవారు. అయితే ఇటీవల కాలంలో ప్రగతి సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇక ఈ వయసులో కూడా ఈమె తన ఫిట్నెస్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఎప్పుడు జిమ్ లోనే వర్కౌట్ చేస్తూ ఉంటారు.
ఇలా తన వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఈమె కొంతమందికి స్ఫూర్తిగా నిలువగా మరి కొందరు మాత్రం ఈ వయసులో అవసరమా అంటూ విమర్శలు కూడా కురిపిస్తూ ఉంటారు అయితే ఈ విమర్శలను మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ ఈమె నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ కార్యక్రమంలో ప్రొఫెషనల్ కే పోటీ ఇస్తూ మూడో స్థానంలో నిలిచారు.
తాజాగా 48 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొన్నారు ప్రగతి. ఈ పోటీలలో భాగంగా ఈమె అందరిని వెనక్కు నెడుతూ గట్టి పోటీ ఇచ్చి ఏకంగా గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. ఇలా ఈమె సాధించిన ఈ గోల్డ్ మెడల్ ను మెడలో వేసుకొని ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసిన ఎంతోమంది ఫాన్స్ ఈమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Latest Videos :
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…