Hyderabad: ఇటీవల కాలంలో అమ్మాయిలను ,మహిళలను వేధించే ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎంతోమంది బాధితులు ఈ సంఘటనల గురించి బయట చెప్పలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లో ఒకటి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
టోలిచౌకి సమతాకాలనీలో నివసించే ఓ వివాహిత (32) స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. అయితే ఈమె భర్త గత కొన్ని సంవత్సరాలుగా దుబాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఇలా తన భర్త దుబాయిలో ఉన్నప్పటికీ ఈమె ఇక్కడ తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. అయితే ఒకసారి ఈ మహిళ స్కూల్ అడ్మిషన్ల కోసం ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు అయితే ఈమెపై మనసు పడ్డ ఓ యువకుడు షేక్ వసీం ఆమెకు అడ్మిషన్ కావాలి అంటూ మెసేజ్ చేస్తూ అలాగే ఫోన్ నెంబర్ సేకరించారు.
ఇలా ఆమె ఫోన్ నెంబర్ ఆ యువకుడికి దొరికినప్పటి నుంచి ఆమెను ఫోన్ చేస్తూ మానసికంగా ఎంతో వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. ఆమె ఫోన్ నెంబర్ మార్చినా కూడా అక్కడ స్కూల్లో పనిచేసే ఇతరులతో తన పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకొని మరి వేధింపులకు గురి చేశారు. ఇక తను ఏడు నెలలుగా ఆ యువకుడు మహిళను వేధింపసాగాడు. దీంతో ఫోన్ నెంబర్లను కూడా బ్లాక్ చేసి పెట్టగా షేక్ వసీం మాత్రం రాపిడో డ్రైవర్లను పంపించి వారికి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడించాలి అంటూ విసిగించేవారు.
ఇలా గత కొన్ని నెలలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నప్పటికీ ఆ వివాహిత భరిస్తూనే వచ్చారు అయితే ఇటీవల షేక్ వసీం తనని బెదిరింపులకు గురి చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే నీ పిల్లలను కిడ్నాప్ చేస్తాను అంటూ మెసేజ్ రూపంలో బెదిరింపుసాగారు. దీంతో భయాందోళనలకు గురైన ఆ వివాహిత వెంటనే ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించి షేక్ వసీం తనని ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని బయటపెట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
Latest Videos :
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…