Categories: FeaturedMovie News

Prakash Raj supports Sai Pallavi : మానవత్వమే అన్నిటికన్నా ముందు… సాయి పల్లవి వివాదం పై స్పందించిన ప్రకాష్ రాజ్…

Prakash Raj supports Sai Pallavi : నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సాయి పల్లవి, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా విరాట పర్వం. ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విడుదల ముందు సాయి పల్లవి ప్రమోషన్ కార్యక్రమాలలో బాగా పాల్గొన్నారు.

అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలోని లోని హింస, గోరక్షక దళాలు, మానవత్వం’ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నాయకులు ఆగ్రహం కూడా వ్యక్తపరచారు. అయితే వీటిపై వివరన ఇస్తూ సాయి పల్లవి ఒక వీడియోని విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా సాయి పల్లవి ఇచ్చిన వివరణ పై ప్రకాష్ రాజ్ స్పందించారు.

మానవత్వమే అన్నిటికన్నా ముందు…..

సాయి పల్లవి వీడియోలో తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికి తప్పేనని, తన మాటల్ని అందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి ముమ్మాటికీ లేదని తన మాటలకు వివరణ ఇచ్చింది. సాయి పల్లవి ఇచ్చిన ఈ వివరణపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు.
స్పందించడమే కాదు ఆమెకు మద్దతుగా నిలుస్తూ ట్వీట్‌ కూడా చేశారు. ఈ ట్వీట్‌లో ‘మానవత్వమే అన్నింటికంటే ముందు…. కాబట్టి సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం.’ అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు ప్రకాశ్‌ రాజ్‌.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago