Prakash Raj supports Sai Pallavi : నక్సలిజం బ్యాక్డ్రాప్లో సాయి పల్లవి, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా విరాట పర్వం. ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విడుదల ముందు సాయి పల్లవి ప్రమోషన్ కార్యక్రమాలలో బాగా పాల్గొన్నారు.

అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి కశ్మీర్ ఫైల్స్ సినిమాలోని లోని హింస, గోరక్షక దళాలు, మానవత్వం’ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నాయకులు ఆగ్రహం కూడా వ్యక్తపరచారు. అయితే వీటిపై వివరన ఇస్తూ సాయి పల్లవి ఒక వీడియోని విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా సాయి పల్లవి ఇచ్చిన వివరణ పై ప్రకాష్ రాజ్ స్పందించారు.
మానవత్వమే అన్నిటికన్నా ముందు…..

Humanity first … we are with you @Sai_Pallavi92 https://t.co/6Zip4FJPv3
— Prakash Raj (@prakashraaj) June 19, 2022
సాయి పల్లవి వీడియోలో తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికి తప్పేనని, తన మాటల్ని అందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి ముమ్మాటికీ లేదని తన మాటలకు వివరణ ఇచ్చింది. సాయి పల్లవి ఇచ్చిన ఈ వివరణపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.
స్పందించడమే కాదు ఆమెకు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ కూడా చేశారు. ఈ ట్వీట్లో ‘మానవత్వమే అన్నింటికంటే ముందు…. కాబట్టి సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం.’ అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు ప్రకాశ్ రాజ్.



























