Prakash Raj: ఆ సినిమాకు భాస్కర్ అవార్డు కూడా రాదు…ది కాశ్మీర్ ఫైల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్!

Prakash Raj: సౌత్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన ప్రకాష్ రాజ్ ఆ తర్వాత విలన్ గా నెగిటివ్ పాత్రలలో నటించడమే కాకుండా, తండ్రిగా మంచి పాజిటివ్ పాత్రలలో కూడా నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇలా భాషతో సంబంధం లేకుండా కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్ సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

ఇలా నటుడిగా గుర్తింపు పొందటమే కాకుండా రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా ఉంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో ఇప్పుడు చర్చాంశనీయంగా మారాయి. ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అనే ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ప్రకాష్ రాజ్ ‘పఠాన్’ సినిమా సూపర్ హిట్ అవ్వడం గురించి మాట్లాడుతు షారుఖ్ సినిమాను పొగడటమే కాకుండా.. మరొకవైపు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు ఇడియట్స్ అన్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. ఇప్పుడు ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలని గోల చేసినవారు అప్పుడు మోడీ సినిమాకి కనీసం రూ.30 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయారని విమర్శించాడు.

Prakash Raj: అత్యంత చెత్త సినిమా….

ఇలా సినిమా బ్యాన్ చేయాలని కేవలం సౌండ్ పొల్యూషన్ మాత్రమే చేస్తారు. ఈమధ్య కాలంలో వచ్చిన చెత్త సినిమాలలో “ది కాశ్మీర్ ఫైల్స్”సినిమా కూడా ఒకటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఆ సినిమా దర్శకుడు ఆస్కార్ నామినేషన్ రాలేదని అడుగుతున్నాడు. అలాంటి చెత్త సినిమాకు భాస్కర్ అవార్డు కూడా రాదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చనీయంగా మారాయి.