Praneetha Shubhash : ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ప్రణీత ఆ తరువాత సిద్ధార్థ హీరోగా వచ్చిన బావ సినిమా లో చేసింది. అయితే ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. ఇక ప్రణీతకు హీరోయిన్ గా మంచి అవకాశాలు కూడా రాలేదు. అయితే మిగిలిన భాషలలో మంచి అవకాశాలతో పలు సినిమాల్లో నటించిన ప్రణీత అత్తారింటికి దారేది సినిమాల్లో పవన్ కళ్యాణ్ మరదలిగా నటించి బాపు బొమ్మగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రభస లో ఎన్టీఆర్ సరసన, బ్రహ్మోత్సవం సినిమాల్లో మహేష్ మరదలిగా నటించిన ఈ కన్నడ కాస్తిరి మెయిన్ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేదు.
తన కూతురి ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత…
ఇక హిందీలో కూడా పలు సినిమాల్లో నటించిన ప్రణీత ఆ తరువాత సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో కరోనా లాక్ డౌన్ సమయంలో వ్యాపార వేత్త నితిన్ రాజు ను వివాహం చేసుకుంది. ఇటీవలే ప్రణీత ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి కాబోతున్న విషయం దగ్గరి నుండి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్న ప్రణీత తన డెలివరీ సమయంలో తాను పడిన బాధ, ఆనందం తన తల్లి దగ్గరుండి అన్ని చూసుకోవడం, అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన మధురానుభూతులను అభిమానులతో పంచుకుంది.
ఇక తాజాగా కూతురిని ముద్దాడుతూ, అలాగే భర్తను ముద్దు పెట్టుకుంటూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు అంటూ షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతకు ముందు సోషల్ మీడియాలో ప్రణీత ప్రెగ్నెన్సీ సమయంలో ఫిట్ నెస్ కి సంబంధించిన అవగాహన వీడియోలను ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…