Pranitha: ప్రణీత సుభాష్ పరిచయం అవసరం లేని పేరు ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె పలు సినిమాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకోవడం వెంటనే బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఇలా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే భీమన అమావాస్య రోజు మరోసారి ఈమె తన భర్త పాదాలకు పూజ చేస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.
గత ఏడాది కూడా ఈమె తన భర్తకు పాద పూజ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో అప్పుడు ఇప్పుడు కూడా ఈ విషయం పట్ల ప్రణీత పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలపై స్పందిస్తూ ఈమె చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భీమన అమావాస్య కారణంగా నా భర్తకు పాధ పూజ చేశాను అయితే ఈ విషయంపై చాలామంది విమర్శలు చేశారు. అలా నన్ను విమర్శలు చేసిన వారికి ఇది పితృస్వామ్య పాలనలా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం ఈ పూజ మన సనాతన ధర్మంలో ఒక భాగమేనని తెలిపారు.
ఈ పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇలాంటి పూజలకు ప్రాముఖ్యతను తెలియజేస్తూ మన హిందూ పురాణాలలో చాలా కథలు ఉన్నాయి.మన సంస్కృతి ప్రకారం అందరి దేవతలను ఒకే విధంగా పూజిస్తాము అంటూ ఈ సందర్భంగా ఈమె తన పట్ల విమర్శలు చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ షేర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…