Categories: FeaturedMovie News

Prathyusha : ప్రత్యూష చనిపోతే మోహనబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి నా మొహం చూడను అని తిట్టారు : ప్రత్యూష మదర్ సరోజినీదేవి

Prathyusha : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ఎన్నోసార్లు కేసులో వెనక్కి తగ్గాలని భయపెడుతూ ఫోన్స్ వచ్చాయంటూ చెప్పిన సరోజినీ గారు, ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు కానీ ఎవరూ సహాయం చేయలేదని  చెప్పారు.

మోహన్ బాబు నన్ను తిట్టారు… మాణిక్యాన్ని పోగొట్టుకున్నావు అన్నారు…

ప్రత్యూష మరణం తరువాత ఇండస్ట్రీ నుండి రోజా, ఉదయ్ కిరణ్, ప్రభు, వెంకట్, సత్యరాజ్ వంటి వారు ఫోనే చేసి పరామర్శించారు. అయితే నేను పోరాడుతుంటే ఎవరూ మద్దతు ఇవ్వలేదంటూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి చెప్పారు. ఇక మోహన్ బాబు గారు ప్రత్యూష మరణించాక ప్రెస్ మీట్ లో నన్ను తిట్టారంటూ చెప్పి ఆ హక్కు ఆయనకు ఉంది అంటూ అభిప్రాయపడ్డారు.

ఒక మంచి పాత్రతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి అమ్మ చేతిలో పెట్టి చూసుకోమంటే పోగొట్టుకుంది, ఒక మాణిక్యాన్ని కోల్పోయింది, జీవితంలో మళ్ళీ ఆ తల్లి మొహం నేను చూడను అంటూ చెప్పాడట. ఈ విషయాలను సరోజినీ గారు చెబుతూ ఆయనకు ఆ హక్కు ఉంది నన్ను అనడానికి అంటూ చెప్పారు. ఎవరూ సహాయం చేయకపోయినా ఎన్నేళ్ళైనా పోరాడుతున్నాను చాలా మంది న్యాయం జరగదు వదిలేయండి అంటుంటారు కానీ నేను పోరాడుతూనే ఉన్నాను, సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళాను అంటూ సరోజినీ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago