Movie News

Puri Jagannadh: లైగర్ ఫ్లాప్ తరువాత బయ్యర్లు పూరీని బ్లాక్ మెయిల్ చేసారా? వైరల్ అవుతున్న పూరీ జగన్నాథ్ ఆడియో ! లీక్ చేసింది ఎవరు ?

Puri Jagannadh: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను తీసుకువస్తే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సినిమాలు డిజాస్టర్ గా మిగిలి పెద్ద ఎత్తున నష్టాలను తెచ్చి పెడుతుంటాయి. ఇలాంటి కోవకు చెందినదే పూరి జగన్నాథ లైగర్ సినిమా.

ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎన్నో ఎత్తుపల్లాలని చూసిన పూరీ జగన్నాథ తన సినీ కెరియర్ ముగుస్తుంది అనుకున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు కొట్టారు. ఇదే అంచనాల నడుమ ఈయన లైగర్ అనే పాన్ ఇండియా సినిమాని భారీ బడ్జెట్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అంచనాలను తలకిందులు చేసి భారీ నష్టాలను మిగులుతుంది.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ బయ్యర్లకు పెద్ద ఎత్తున డబ్బులు కూడా తిరిగి ఇచ్చారని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా పూరి జగన్నాథ్ బయ్యర్లతో మాట్లాడినటువంటి ఒక ఆడియో కాల్ లీక్ అయింది. అయితే ఇందులో బయ్యర్లు పూరి జగన్నాథ్ కి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇందులో పూరి మాట్లాడుతూ ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా నేను ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు ఇస్తున్నాను వాళ్లు కూడా నష్టపోయారన్న ఉద్దేశంతోనే తిరిగి డబ్బులు ఇస్తున్నాను అంటూ ఈయన మాట్లాడారు.
నిజంగానే పూరికి వార్నింగ్ ఇచ్చారా..

Puri Jagannadh:

బయ్యర్లతో కలిసి మాట్లాడడం జరిగింది మా ఇద్దరి మధ్య ఒక అమౌంట్ సెటిల్ అయ్యింది. కొద్ది రోజులు టైం కావాలని అడిగినా కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలనిపించదు అంటూ పూరి మాట్లాడారు. ఇకపోతే ధర్నాలు చేస్తామని డిమాండ్ చేస్తే ధర్నా చేసిన వారందరూ లిస్టు తాను తీసుకొని వారికి తప్ప మిగిలిన వారందరికీ డబ్బు ఇస్తానంటూ ఈయన తెలిపారు.నష్టాలు వస్తే డబ్బు ఇవ్వమని డిమాండ్ చేస్తారు లాభాలు వస్తే బయర్లు డబ్బు ఇవ్వరు కదా నాకు పోకిరి సినిమా నుంచి ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు ఎంతో మంది బయ్యర్లు చాలా వరకు డబ్బు ఇవ్వాల్సి ఉంది అంటూ పూరి మాట్లాడినటువంటి ఒక ఆడియో కాల్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago