L.B. Sriram : కమెడియన్ గా అందరికీ బాగా తెలిసిన ఎల్బి శ్రీరామ్ గారు మంచి హాస్యానటుడే కాదు గొప్ప రైటర్ కూడా. ఆయన డైలాగు రైటర్ గా సినిమాలకు పనిచేసారు. విభిన్నమైన డైలాగు డెలివరీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బ్యానర్ మీద షార్ట్ ఫిలిమ్స్ ను తీస్తున్నారు. సినిమాల్లో ఇస్తున్న మూస పాత్రలను చేయడం ఇష్టం లేక వాటి నుండి తప్పుకున్నాను అంటూ శ్రీరామ్ చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడిన ఎల్బి శ్రీరామ్ గారు ప్రస్తుతం ‘కవి సామ్రాట్’ అనే షార్ట్ ఫిల్మ్ ను ఆహా ఒరిజినల్స్ లో చేశారు.
రైటర్ గా మొదటి సినిమా శ్రీరామ్ గారు డైరెక్టర్ గీతా కృష్ణ గారి ‘కోకిల’కు పనిచేశారు. ఆ సినిమా మంచి హిట్. దాని తరువాత పెద్ద వంశీ గారి ‘ఏప్రిల్ ఒకటి విడుదల’ సినిమాకు రైటర్ గా పనిచేసారు. అది ఘన విజయం సాధించింది. నెక్స్ట్ ఇక ‘అప్పుల అప్పారావు’ సినిమా కు డైలాగులు రాసారు ఈ సినిమా కూడా సూపర్ హిట్. అయితే మొదటి సినిమా, రెండో సినిమా తనకు రైటర్ గా సంతృప్తి ఇవ్వలేదంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు. మొదటి సినిమాలో డైలాగులు ఇంగ్లీష్, తెలుగు రెండు కలిపి ఉండటం వల్ల రైటర్ కి పెద్దగా గొప్గా పేరు వచ్చేంత లేదు అందుకే సంతృప్తి కలగలేదు.
ఇక వంశీ గారి సినిమా విషయంలో కూడా సంతృప్తి కలుగలేదు, రెండు పెద్ద హిట్స్ అయిన రైటర్ గా సంతృప్తి లేదు అంటూ వంశీ గారితో పనిచేసినపుడు జరిగిన కొన్ని విషయాలు నాకు నచ్చలేదు, ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఇక ఆ సినిమా తరువాత అందుకే పని చేయలేదు అంటూ చెప్పారు. ఇక కమెడియన్ గా ఒక కొత్త డైలాగు డెలివరీతో ఆకట్టుకున్నా దాన్ని కొంసాగించాలని అనుకోలేదు, అదే మూసలో పావడం ఇష్టం లేదు అందుకే ‘అమ్మో ఒకటో తారీఖు’ వంటి సినిమా చేశాను. కానీ ఆ తరువాత అన్నీ అలాంటి సెంటిమెంట్ పాత్రలే వచ్చాయి. ఇక మూస పాత్రలను చేయడం ఇష్టం లేక సినిమాలకు దూరంగా ఉంటూ షార్ట్ ఫిలిమ్స్ ను హార్ట్ ఫిలిమ్స్ పేరుతో తీస్తున్నాను అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…