Preethi Nigam: ఈటీవీలో ప్రసారమైన ఎన్నో సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించి ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ నటి ప్రీతి నిగమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఋతురాగాలు సీరియల్ ద్వారా నటిగా అడుగుపెట్టిన ప్రీతి ఆ తర్వాత వరుస సీరియల్స్ లో సినిమాలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి నిగమ్ తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో విలన్ పాత్రలలో నటించటం గురించి ప్రీతినిగమ్ స్పందించింది. ఈ క్రమంలో ప్రీతి నిగమ్ మాట్లాడుతూ.. ” సీరియల్స్ లో అన్ని పాత్రల కన్నా విలన్ పాత్రలో నటించడం చాలా కష్టం అని తెలిపింది . విలన్ పాత్రలలో నటించటం వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ…” ఒకసారి విజయవాడలో హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ బాయ్ నా వైపు ఏదోలా చూశాడు.
అతను అలా చూస్తుంటే మొదట భయపడ్డాను. ఆ తర్వాత ఎందుకలా చూస్తున్నావు అని అతన్ని అడిగితే.. ‘ మీరు ఆ సీరియల్లో చేశారు కదా.. ఇంట్లో మా నానమ్మ రోజు మిమ్మల్ని తిడుతూ ఉంటుంది’ అని చెప్పాడు. ఆ తర్వాత ఒకసారి వైజాగ్ వెళ్లడానికి ట్రైన్ లో ఎక్కినప్పుడు ఒక ఆవిడ దగ్గరకు వచ్చి’ మీరు మా ఊరు రావద్దండి. అక్కడికి వస్తే మా వాళ్ళు మిమ్మల్ని కొడతారు ‘ అని చెప్పింది అంటూ ప్రీతి తెలిపింది.
ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు నా పాత్ర వారికి అంతగా కనెక్ట్ అయ్యిందని సంతోషించేదాన్ని అంటూ ప్రీతి తెలిపింది. ఇక ప్రీతి నటించిన కావ్యాంజలి సీరియల్ లోని తన పాత్రకు నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. అలాగే తన భర్త, కుమారుడి గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకోసం, తన కొడుకు కోసం భర్త ఉద్యోగం వదులుకున్నాడని తెలిపింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…