మనం రోజు ఉదయం లేవగానే చేసే మొదటి పని బ్రష్ చేయడం. ఈ నేపథ్యంలోనే దంతాలను శుభ్రం చేసుకోవడానికి అనేక రకాలుగా పేస్ట్ లను వాడుతూవుంటాము. అయితే పిల్లలూ బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్ చేసుకున్న తరువాత వచ్చే ఆ నరగను మింగేస్తూ ఉంటారు. ఇంకా కొద్ది మంది పిల్లలు అయితే ఉత్త పేస్టుని తింటూ ఉంటారు. అయితే దంతాలను శుభ్రం చేయడానికి వాడే టూత్ పేస్టులు చాలా ప్రమాదకరమని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
టూత్ పేస్ట్ కడుపులోకి వెళ్లి అస్థిపంజర ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. ఈ వ్యాధి వచ్చిన తరువాత నెమ్మదిగా శరీరంలోని ఎముకలు బలహీనపడటం మొదలవుతాయి. దీంతోపాటుగా దంతాలు కూడా దెబ్బతింటాయి.న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టూత్ పేస్ట్ వాడుతున్నప్పుడు పిల్లలు మింగకుండా గమనించాలి.
టూత్ పేస్ట్ తినడం వల్ల లోపల ఫ్లోరైడ్ ఉంటుంది. దీనిని తినడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. అంతే కాకుండా అధిక ఫ్లోరైడ్ ఉన్న నీరు తాగడం వల్ల కూడా ఈ వ్యాధి సంభవిస్తుంది. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు బ్రష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దంతాలను శుభ్రం చేసుకోవడానికి బటాని గింజ అంత పేస్ట్ సరిపోతుంది. ఫ్లోరోసిస్ వ్యాధి రెండు విధాలుగా ఉంటుంది. ఇందులో మొదటిది డెంటల్ ఫ్లోరోసిస్, రెండవది అస్థిపంజర ఫ్లోరోసిస్.
ఈ పోరోసిస్ వచ్చినప్పుడు దంతాలు పసుపుగా మారడం, చేతులు కాళ్లు నొప్పులు ఉండటం, కళ్ళ చుట్టూ వాపులు రావడం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి బారిన పడకూడదు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.చిన్న పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ను ఉపయోగించండి. పిల్లలు బ్రష్ చేసుకునే టప్పుడు వారిని గమనిస్తూ ఉండాలి. అలాగే పిల్లలకు అందుబాటులో లేకుండా టూత్ పేస్ట్ ను దూరంగా ఉంచాలి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…