బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. రెండో కెప్టెన్ గా కండల వీరుడు విశ్వా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ షో కొంతమందికి నచ్చడం లేదు. అయినా టీఆర్పీ రేటింగ్ వస్తూనే ఉంది. తిట్టడానికైనా ఈ షోను టీవీల్లో చూస్తూనే ఉన్నారు. అయితే ఇలా విశ్వా ఎంపిక అయిన తర్వాత హౌస్ లో మరో లెవల్ కి వెళ్లింది.
రెండో వారంలో వరెస్ట్ పర్ ఫార్మర్ ఎవరూ అంటూ బిగ్ బాస్ మరో ట్విస్ట్ పెట్టేశాడు. దీనిపై హౌస్ లోని సభ్యులు వాళ్లకు ఎవరు ఇష్టం లేరో వాళ్లను ఎంచుకున్నారు. దీనికంటే ముందు లగ్జరీ బడ్జెట్ కోసం బాల్ పట్టు.. లగ్జరీ బడ్జెట్ కొట్టు అనే కాన్సెప్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఒక పైపు మాదిరిగా ఉంటే దాంట్లో నుంచి బాల్స్ కిందకు వస్తుంటాయి. బాల్ కిందపడకుండా పట్టుకుంటే లగ్జరీ బడ్జెట్ పూర్తి అయినట్లే. దీని తర్వాత వరెస్ట్ పర్ ఫార్మర్ ను హౌస్ లో సభ్యులు ఎంచుకుంటారు.
అందులో మొదటగా సన్నీ.. నటరాజ్ ను ఎంచుకుంటాడు. తర్వాత హమీద కూడా సన్నీని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ప్రియాంక సింగ్ ను కూడా వరెస్ట్ పర్ ఫార్మర్ గా ఎంచుకుంటే.. దయచేసి నాది వరెస్ట్ పర్ ఫార్మర్ అని మాత్రం అనొద్దు .. దానికి నేను ఒప్పుకోను అంటూ వాధిస్తుంది. ఇక కాజల్ కు ప్రియాకు మధ్య పెద్ద సంభాషణ చోటు చేసుకుది. అందులో ప్రియా కాజల్ ను నీ సంస్కారం కాదు అని పేర్కొటుంది.. దానికి కాజల్ సమాధానంగా ఈ నిమిషంలో నీ సంస్కారం ఇదే అని వదిలేస్తా అంటూ చెప్పుకొస్తుంది.
ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ప్రియా ఎదురుగా ఉన్న కాజల్ పై విరుచుకుపడుతుంది. దట్ ఈజ్ రాంగ్ ‘‘నువ్వు అబద్దం కూడా చాలా నిక్కస్సుగా చెబుతావు కాజల్’’ అంటూ.. ప్రియా చెబుతుంది. తర్వాత ప్రియాకు కాజల్ దండం పెడుతూ.. అక్కడ నుంచి వెళ్లి పోతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…