Producer Adisheshagiri Rao : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలో అవకుండా సెట్ చేసిన వాళ్లలో కృష్ణ ముందుంటారు. కొత్తదనాన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబ కథా చిత్రాలు తీసినా, కౌ బాయ్ సినిమాలు తీసినా, గూఢచారి అంటూ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మల్టీ స్టారర్ సినిమాలను కూడా ఎక్కువగా దాదాపు అందరి హీరోలతో చేశారు కృష్ణ గారు. తెనాలి వద్ద బుర్రిపాలెం నుండి చెన్నై కి వచ్చి సినిమాల్లో సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ గారి మొదటి మరియు హైయెస్ట్ రెమ్యూనరేషన్స్ ఏంటి అనే విషయాన్ని ఆయన తమ్ముడు నిర్మాత ఆదిశేషగిరి రావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
మొదటి 20 సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ అంతే…
కృష్ణ గారు ‘తేనె మనసులు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమా తరువాత గుడాచారి, అవే కళ్ళు వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకుని వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. ఆ సమయంలో ఆయన అందుకున్న రెమ్యూనరేషన్ 5000 ఒక సినిమాకు అంటూ ఆయన తమ్ముడు ఆదిశేషగిరి రావు తెలిపారు. ఇక మొదట తేనెమనసులు సినిమాకు ఖర్చులకు 350 మాత్రమే ఇచ్చారని తెలిపారు.
ఇక అలా ఒక్కో మెట్టు ఎక్కిన కృష్ణ గారు కెరీర్ మొత్తం లో తీసుకున్న అతి పెద్ధ రెమ్యూనరేషన్ 25 లక్షలు అంటూ చెప్పారు. అయితే కృష్ణ గారు ప్రొడ్యూసర్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాగుపడాలని సినిమా ఫ్లాప్ అయితే నష్టాలను మిగిలిస్తే తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేవారని తెలిపారు ఆదిశేషగిరి రావు. కొన్నిసార్లు సినిమా పూర్తయ్యాక థియేటర్ కి పంపించడానికి డబ్బు లేకపోతే కృష్ణ గారే సహాయం చేసేవారు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…