Featured

Kadambari Kiran : నాగార్జున వచ్చి నాన్నగారితో యాంకరింగ్ చేయించాలి అన్నాడు… పళ్ళు రాలగొడతాడు అని చెప్పా…: కాదంబరి కిరణ్

Kadambari Kiran : తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఒక డైరెక్టర్ గా, సీరియల్ ప్రొడ్యూసర్ గా అందరికి సుపరిచితుడైన కాదంబరి కిరణ్ తన సినిమా చేదు అనుభవాలతో పుస్తకాన్ని కూడా రాస్తున్నానని చెప్పారు. కిరణ్ మొదట జర్నలిస్ట్ గా ఈనాడు లో పనిచేస్తూ ఉన్నపుడే సీరియల్స్ లో నటించారు. ఇక చాలా సీరియల్స్ కు ప్రొడ్యూసర్ గా ఉండి చాలా డబ్బు నష్టపోయినట్లు చెప్పారు కిరణ్. ఇక ఏఎన్ఆర్ గారితో మంచి అనుబంధం కలిగి ఉన్న కాదంబరి గారు ఇండస్ట్రీలో తాను ఎదగక పోడానికి కారణాలను తాజా ఇంటర్వ్యూలో వివరించారు.

నాగార్జున తో సినిమా చేయలేక పోయాను…

డైరెక్టర్ గా మొదటి సినిమా కుర్రాళ్ళ రాజ్యం ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిన సమయంలో ఏమి చేయాలో ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా ఉండాలా లేక డైరెక్టర్ గా కొనసాగాలా అనే సంశయంలో ఉన్నాను, అయితే ఇండస్ట్రీ తప్ప నాకు బయట ప్రపంచం తెలియదు అందుకే ఇక్కడే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నా అని కిరణ్ చెప్పారు. ఇక అక్కినేని వారి ఇంట్లో రెండున్నర గంటలు కథ చెప్పి కూర్చో పెట్టిన ఘనత ఒక ముగ్గురు డైరెక్టర్లకే ఉంది అందులో నేను ఒకడిని. నాగార్జున గారికి పల్లెటూరి సినిమా పేర్లంటే ఇష్టం అందుకే బావ కథ చెప్పగానే నచ్చింది. రెండున్నర గంటలు స్టోరీ విన్నాడు. మొత్తం కథలో రెండు సన్నివేశాలను మార్చమని చెప్పాడు. అయితే మళ్ళీ ఇంతవరకు ఆ మార్చిన సీన్స్ వినలేదు. ఆరోజు కథ విన్నప్పుడు అక్కడ ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు ఉన్నారు. అందులో ఒకాయన నన్ను పక్కకు పిలిచి చినబాబుని ఇంతసేపు కుర్రచుబెట్టావ్ నీ కథతో నీకు టాలెంట్ ఉంది అంటే అది పొగడ్త అనుకున్నా, కాదు అని చాలా రోజులకు అర్థమైంది. అతనికి కాలి ఆ మాట అన్నాడు.

ఇక అక్కడితో నాకు నాగార్జున కి కనెక్షన్ పోయింది. అయినా నాగార్జున తో సినిమా చేయనంత మాత్రాన నేనేం చనిపోలేదు బ్రతికే ఉన్నాను, ఇండస్ట్రీ లోనే ఉన్నాను. నాగేశ్వరావు గారు నా హీరో ఆయనతో చాలా సన్నిహిత్యం ఉండేది. ఒక్కోసారి నాగార్జున ఆయనతో ఏదైనా చెప్పాలంటే నాకు చెప్పి చెప్పమనేవారు, అలా నాగార్జున ఒకరోజు వచ్చి నాన్నగారు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది ఒకసారి కనుక్కో అని చెప్పారు. యాంకరింగ్ అంటూ చెబితే పళ్ళు రాలగొడతాడు, నీకు తండ్రి కావొచ్చు కానీ నాకూ దేవుడు అంటే నాగార్జున అలా కాదు ఆయన సినిమా అనుభవాలను అందరికి చెబితే బాగుంటుంది, ఆయనే విషయాలను చెప్పాలి అది ప్రోగ్రామ్ ఒప్పించు అని చెప్పారు. నాగేశ్వరావు గారి జీవిత విశేషాలను ఆయన అనుభవాలను నేటి తరానికి చెబితే ఉపయోగకరంగా ఉంటుందని నాగేశ్వరావు గారు మంచి మూడ్ లో ఉన్నప్పుడు చెప్పాను. ఒక ఫిల్మ్ లైబ్రరీ లాగా ఉంటుంది ప్రోగ్రామ్ చేయండి అన్నాను, ఆయనకు ఫిల్మ్ లైబ్రరీ అనే మాట నచ్చి ఆలోచిస్తానని చెప్పారు అలా ఆయనను ఒప్పించాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago