Featured

Senior artist Anju : టైగర్ ప్రభాకర్ తో ప్రేమ, విడాకులు… రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలియదు… ప్రెగ్నెట్ గా ఉన్నపుడు ఏం చేశాడంటే…: సీనియర్ ఆర్టిస్ట్ అంజు

Senior artist Anju : చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం అలా సౌత్ భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న నటి అంజు. అసలు పేరు పార్వతి అయినా అంజుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లో శోభన్ బాబు, చిరంజీవి వంటి పలు హీరోలతో నటించిన అంజు హీరోయిన్ గా దాదాపు అన్ని భాషలలో కలిపి 70 దాక సినిమాల్లో నటించిది. తెలుగులో నిరీక్షణ వంటి సినిమాలో నటించిన అంజు చాలా గ్యాప్ తరువాత శేషు లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అంజు.

టైగర్ ప్రభాకర్ తో పెళ్లి… విడాకులు…

చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ అయిన అంజు కన్నడ సినిమాల్లో నటించే సమయంలో విలన్ గా అప్పటికే మంచి స్టార్ డమ్ ఉన్న నటుడు ప్రభాకర్ ప్రేమలో పడ్డారు. ఒక సినిమాలో ఇద్దరూ కలిసి పనిచేసినపుడు ఏర్పడిన పరిచయంతో టైగర్ ప్రభాకర్ ఆమెకు ప్రపోజ్ చేయడం, అంజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పడంతో ఆ సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసేసుకున్నారు అంజు. అయితే అప్పటికే ప్రభాకర్ కి ఒక పెళ్ళై విడాకులు తీసుకున్న విషయం తెలిసినా ప్రేమించారు. ఇద్దరికి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ. పెళ్లి సమయానికి అంజు వయసు 18 ఏళ్ళు కాగా ప్రభాకర్ వయసు నలభై దాటేసింది. అయినా ఆయనను పెళ్లి చేసుకోడానికి పెద్దలను కాదని చేసుకున్న అంజు కి పెళ్ళైన తరువాతే అప్పటికే ప్రభాకర్ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయనే విషయం తెలిసింది. మొదటి పెళ్లి మాత్రమే తెలిసిన అంజు షాక్ అయిందట.

ఇక మూడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో గొడవలు పెరిగి, ఉంటే సర్దుకుని ఉండు లేకపోతే వెళ్ళిపో అని భర్త నుండి సమాధానం రావడం, చాలా మంది అమ్మాయిలతో తనకు అఫైర్స్ ఉన్నాయనే విషయం తెలియడంతో ఇక ప్రభాకర్ తో ఉండాలేని అంజు అక్కడి నుండి పుట్టింటికి వచ్చేసారట. బాబు పుట్టాక ఒక్కసారిగా కూడా పలకరించలేదని, బాబును చూడలేదని ఆ బాధ, కోపం ఉన్నాయంటూ చెప్తారు అంజు. ఇక టైగర్ ప్రభాకర్ తన 48 ఏళ్ల వయసులో మరణించారు. అప్పటికి బాబు కి మూడు సంవత్సరాలు వయసు అందువల్ల తన తండ్రి గురించి ఏమి పెద్దగా తెలియదు. చనిపోయినపుడు చూడటానికి కూడా వెళ్ళలేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago