Featured

Producer Adisheshagiri Rao : మీకు తెలిసిన మహేష్ వేరు… మాకు తెలిసిన మహేష్ వేరు… 14 ఏళ్ల వయసులో కారు నడుపుతూ పోలీసులకి దొరికిపోయాడు…: నిర్మాత ఆదిశేషగిరి రావు

Producer Adisheshagiri rao : సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆదిశేషగిరి రావు గారు అన్న కృష్ణ గారికి తోడుగా ప్రతి విషయంలోనూ ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉండేవారు. పద్మాలయా స్టూడియోస్ కట్టాక ఆ స్టూడియో బాధ్యతలను ఆయనే చూసుకుంటూ కృష్ణ గారి ఓన్ ప్రొడక్షన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించేవారు. నటనలో కృష్ణ గారు నిర్మాణ రంగంలో ఆదిశేషగిరి రావు గారు అలాగే ప్రొడక్షన్ లో హనుమంత రావు గారు ఇలా ముగ్గురు అన్నదమ్ములు సినిమా రంగంలో ఉండేవారు. ఇక కృష్ణ గారి కుటుంబంలో గతేడాది వరుసగా ముగ్గురు మరణించారు. రమేష్ బాబు గారు మరణించిన కొద్ది నెలలకు ఇందిర గారు ఆ తరువాత కృష్ణ గారు మరణించారు. అలా వరుస విషాదాల తరువాత మొదటి సారి ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆదిశేషగిరి రావు గారు. తన అన్న కొడుకులైన రమేష్, మహేష్ ల గురించి మాట్లాడారు.

మహేష్ చాలా అల్లరి వాడు…

మహేష్ గురించి బయట చాలా తక్కువ తెలుసు కానీ మహేష్ చాలా అల్లరి వాడు అంటూ చెప్పారు. తనకు మంచి మిమిక్రి టాలెంట్ ఉందని చెప్పారు ఆదిశేషగిరి రావు. తాను ఎవరినైనా అనుకరించగలడు అంటూ చెప్పారు. అమితాబ్ బచ్చన్ అంతటి నటుడు మహేష్, చిన్నపుడు బాగా అల్లరి చేసేవాడు అంటూ చెప్పారు.

లైసెన్స్ లేకుండా 14 ఏళ్ల వయసులో తాను కారు నడిపేవాడు. ఒకసారి అలానే కారు ఏసుకుని స్టూడియోకి వచ్చాడు. లైసెన్స్ లేకుండా కారు నడిపాడని పోలీసులు వెనుకే వచ్చారు. స్టూడియోకి వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. పోలీసులకు నచ్చజెప్పి పంపాను, అలా అల్లరి చేసేవాడు. మొదటి సినిమా అప్పుడే తాను టాప్ ఆర్టిస్ట్ అవుతాడని అనుకున్నాం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago