Producer Ambika Krishna : ప్రముఖ పారిశ్రామిక వేత్తగా సినిమా నిర్మాతగా అలానే పొలిటిషియన్ గా ఉన్న అంబికా కృష్ణ అందరికీ సుపరిచితులు. ఆయన నిర్మించిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మరి కొన్ని డిజాస్టర్ గా మిగిలి ఆయనకు భారీగా నష్టం కలిగించాయి. ఇక సినిమా ఇండస్ట్రీ బాగోగుల కోసం రాష్టం విభజన జరిగాక అధికార పార్టీలో ఉండి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇక రాజకీయాలు ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విషయాలను తాజాగా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇండస్ట్రీలో ప్లే బాయ్… ఆ సినిమాకు బాగా నష్టపోయను…
అంబికా కృష్ణ గారు ప్రొడ్యూసర్ గా తీసిన మొదటి సినిమా ఈవివి గారి ‘కన్యధానం’. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచి ఆయనకు లాభాలను అలాగే ఇండస్ట్రీ మీద నమ్మకాన్ని తెచ్చింది. ఇక ఈ సినిమా తరువాత మరి కొన్ని సినిమాలను నిర్మించ్చిన ఈయన అందరితో కలివిడిగా ఉంటూ సరదాగా మాట్లాడుతూ ఉండటం వల్ల అందరూ సరదగా ప్లే బాయ్ అంటూ అనేవారట అంతే అంటూ చెప్పారు.
ఇక బాలకృష్ణ హీరోగా నిర్మించిన వీరభధ్ర, ఈవివి సత్యనారాయణ గారి అబ్బాయి హీరోగా నటించిన ఆడంతే అదో టైపు సినిమాలు బాగా నష్టాన్ని మిగిల్చాయి. ఇందులో ఆడంతే అదో టైపు సినిమాకు కొబ్బరికాయ కొట్టిన ఖర్చులు కూడా రాలేదంటూ చమత్కరించారు. ఇక విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న అంబికా కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీ ఏపీకి రావడానికి షూటింగ్స్ ను ప్రోత్సాహించడానికి అనేక చర్యలు చేప్పట్టినట్లు చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…