Featured

Producer Chittibabu : అస్కార్ వచ్చిందని తల పొగరు వద్దు…: ప్రొడ్యూసర్ చిట్టిబాబు

Producer Chittibabu : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. ఇక ఈ విషయం మీద ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఆయన స్పందన తెలియజేసారు.

ఆస్కార్ బాధ్యత పెంచింది…

చిట్టిబాబు గారు మాట్లాడుతూ ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాటకు అవార్డు వచ్చిందని ప్రకటించిన తరువాత ఆనందానికి అవధులు లేవు అంటూ తెలిపారు. వెంటనే కీరవాణికి అలానే చంద్రబోస్ గారికి అభినందనలు తెలుపుతూ మెసేజ్ చేసానని తెలిపారు. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడానికి ముఖ్య కారకుడు రాజమౌళి అంటూ తెలిపారు. రాజమౌళి కష్టమే సినిమాను అంతర్జాతీయ వేదిక మీద నిలబెట్టింది అంటూ తెలిపారు.

సినిమాను అంతర్జాతీయంగా ప్రచారం చేసి తెలుగు సినిమాకు ప్రపంచం మార్కెట్ కు ద్వారాలు తెరిచాడు రాజమౌళి అంటూ తెలిపారు. ఆస్కార్ వేడుకల్లో ఒక కొరియన్ సినిమా 12 కేటగిరిల్లో నామినేట్ అయి 7 అవార్డులు తెచ్చుకుంది. అది చూసినపుడు నెక్స్ట్ ఇయర్ రాజమౌళి కూడా ఇలానే అవార్డులు అందుకుంటాడు అనిపించింది. అయితే ఈ అవార్డు బాధ్యతను పెంచింది, ఆ అవార్డు తలపొగురు పెంచకూడదు అంటూ మాట్లాడారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago