Producer Chittibabu : సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి ఇంకా వారమైనా గడవక ముందే అప్పుడే సోషల్ మీడియాలో ఆయన ఆస్తుల గురించి ఇవి ఎవరికి చెందుతాయి, నరేష్ కి వాటా ఉంటుందా అనే అంశాల మీద జోరుగా చర్చ నడుస్తోంది. ఇక కృష్ణ గారి డైరీలో అసలు ఏమి రాశారు, ఎవరికి ఆస్తి ఇచ్చారు అనే అంశాల మీద అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు కృష్ణ గారి ఆస్తులు ఆయన పంచారా, ఎవరికి ఇచ్చారు అనే విషయాల మీద క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు.
కృష్ణ గారి కుటుంబ విషయాలు సోషల్ మీడియకు ఎందుకు…
కృష్ణ గారి ఆస్తులు మహేష్, నరేష్ లలో ఎవరికి అంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న రచ్చ గురించి మాట్లాడుతూ చిట్టిబాబు గారు ఫైర్ అయ్యారు. అసలు నరేష్ కి కృష్ణ గారి ఆస్తుల అవసరమే లేదు, ఆయనకు కృష్ణ గారి ఆస్తులతో సంబంధం లేదు. ఎందుకు ఇలాంటి వెధవ చర్చలను చేస్తున్నారు, పనిలేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇక నరేష్ – మహేష్ మధ్య అస్థికలను కృష్ణ నదిలో కలిపే విషయంలో గొడవ జరిగిందని అందుకే నరేష్ హాజరు కాలేదు అన్న వాదన గురించి మాట్లాడారు.
కృష్ణ గారు నరేష్ కు తండ్రి కాదు, ఆయన అస్థికలను కలిపే కార్యక్రమానికి రానవసరం లేదు. దీనిపై ఎందుకంత చర్చ. విజయనిర్మల గారు మరణించినవుడు ఆమె అస్థికల నిమ్మజ్జనం సమయంలో నరేష్ వెళ్లి తంతు చేసాడు కానీ మహేష్ అప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. ఇలాంటి విషయాల మీద ఎందుకు చర్చలు అంటూ ప్రశ్నించారు. కృష్ణ గారు బ్రతికున్నట్లయితే ఆస్తులను అందరికీ సమానంగా పంచేసారు. వాళ్ళింట్లో అసలు అలాంటి గొడవలు వచ్చే ఆస్కారం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…