Producer Chittibabu : సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి ఇంకా వారమైనా గడవక ముందే అప్పుడే సోషల్ మీడియాలో ఆయన ఆస్తుల గురించి ఇవి ఎవరికి చెందుతాయి, నరేష్ కి వాటా ఉంటుందా అనే అంశాల మీద జోరుగా చర్చ నడుస్తోంది. ఇక కృష్ణ గారి ఎవరికి ఆస్తి ఇచ్చారు అనే అంశాల మీద అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు కృష్ణ గారి ఆస్తులు ఆయన పంచారా లేదా, ఎవరికి ఏమి ఇచ్చారు అనే విషయాల మీద క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ చిట్టి బాబు గారు.
కృష్ణ గారి కుటుంబ విషయాలు సోషల్ మీడియాకు ఎందుకు…
కృష్ణ గారి ఆస్తులు మహేష్, నరేష్ లలో ఎవరికి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి మాట్లాడుతూ చిట్టి బాబు గారు ఫైర్ అయ్యారు. అసలు నరేష్ కి కృష్ణ గారి ఆస్తుల అవసరం లేదు, ఆయనకు కృష్ణ గారి ఆస్తులతో సంబంధం లేదు. ఎందుకు ఇలాంటి వెధవ చర్చలను చేస్తున్నారు పనిలేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. నరేష్ కృష్ణ గారి కొడుకు కాదు అలాంటప్పుడు ఆస్తిలో వాటా అంటూ చర్చ ఏమిటి. అయిన బ్రతికి ఉండగానే విజయనిర్మల గారు ఆస్తి పంచారు నరేష్ కి అలాగే మనవడికి, ఇంకా ఆస్తి గోల ఎందుకు.
ఇక కృష్ణ గారు బ్రతికున్నపుడే ఆస్తులను అందరికీ సమానంగా పంచేసారు. వాళ్ళింట్లో అసలు అలాంటి గొడవలు వచ్చే ఆస్కారం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక నరేష్ కు కృష్ణ గారి ఆస్తులు అనే చర్చ అనవసరం. విజయనిర్మల గారు విజయకృష్ణ బ్యానర్ పై ఎన్నో సినిమాలను తీయడానికి కృష్ణ గారు కారణం కాబట్టి ఆయన పిల్లలకు ఆమె ఆస్థిలో కొంతమంది రాసిచ్చింది. మహేష్ కు కొంత ఆస్తి విజయనిర్మల గారి నుండి వచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…