Featured

Producer M.S. Raju : నేను ఇబ్బందుల్లో ఉన్నపుడు ప్రభాస్, మహేష్ రాలేదని…: నిర్మాత ఎంఎస్ రాజు

Producer M.S. Raju : దేవి, వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనోద్ధాంటానా వంటి వరుస హిట్లతో వరుస ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నిర్మాత ఎంఎస్ రాజు గారు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా అభిరుచి గల నిర్మాత. ఆయన బ్యానర్ లో సినిమా అంటే కచ్చితంగా కథ బాగుంటుంది అనేంతలా ఆయన మార్క్ వేసుకున్నారు. వరుస సక్సెస్ లు చూసిన ఎంఎస్ రాజు గారు ఆ తరువాత వరుస ఫ్లాప్స్ అందుకుని ప్రస్తుతం చిన్న సినిమాలను తీస్తున్నారు. ఇక డైరెక్టర్ గా మారి ‘డర్టీ హరి’ అనే బోల్డ్ అటెంప్ట్ చేసిన ఎంఎస్ రాజు గారు ఇటీవల కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా ‘సెవెన్ డేస్ సిక్స్ నైట్స్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిన్న సినిమాలకు పరిమితమైన ఎంఎస్ రాజు గారు ఆయన అనుభవాలను ఇటీవల పలు ఇంటర్యూలలో పంచుకున్నారు.

ఇబ్బందుల్లో వాళ్ళు పట్టించుకోలేదని…

ఏంఎస్ రాజు గారు ఒకప్పుడు వరుసగా సక్సెస్ చూసిన నిర్మాత. అయితే రామ్ పోతినేనితో ‘మస్కా’ సినిమా చేసాక సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తనకు నచ్చిన కథలను మాత్రమే చేయాలని భావించి చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకున్న ఆయన ఆ తరువాత మళ్ళీ కొన్ని సినిమాలను చేస్తున్నా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ విషయం గురించి మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్నపుడు నేను సినిమాలలు తీసి సూపర్ స్టార్లను చేసిన హీరోలు రాలేదా సహాయం చేయలేదా అని అడుగుతుంటారు.

ఇబ్బందులంటే ఏమిటి.. డబ్బు లేకపోవడమా లేక సినిమాలు చేయకపోవడమో తెలియదు కానీ ఎవరైనా ఎందుకు నాకు సహాయం చేయాలి. ప్రభాస్, మహేష్ లను నేనేమీ సూపర్ స్టార్లను చేయలేదు ఆ క్రెడిట్ నేను తీసుకుంటే ఎలా అది తప్పు అంటూ అభిప్రాయాపడ్డారు. ఈ సినిమా ప్రయాణంలో ఒడిదుడుకులు అన్నీ చూసాను, ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago