Featured

Producer Natti Kumar : ఆస్కార్ సన్మాన సభపై విసుర్లు… ఇలాగేనా చేసేది… ఏపీని అవమానించారంటూ నట్టి కుమార్ హాట్ కామెంట్స్

Producer Natti Kumar : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపి ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. దీనిపై తాజాగా అనేక చర్చలు నడుస్తున్నాయి. ఇక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ కి చెందినవారు కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంత్రుల ఆధ్వర్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీతలను సత్కరించారు. అయితే ఈ వేడుక మీద ప్రొడ్యూసర్ నట్టి కుమార్ అసహనం వ్యక్తం చేసారు.

ఏపీ ప్రభుత్వాన్ని అవమానించారు…

నట్టి కుమార్ ఆస్కార్ సన్మాన వేడుక గురించి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేసారు. ఏపీ ప్రభుత్వం నుండి ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ పోసాని ని కానీ, ఆలిని కానీ రోజాను కానీ పిలిచారా?? ఎవరినీ పిలవకుండా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి ఆహ్వానం లేకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి డబ్బు తీసుకుని చేశారు. ఇక ఏపీ నుండి వెళ్లిన మంత్రిని కూడా పెద్దగా పట్టించుకోలేదని, ఆయన మాట్లాడిన దానిమీద కూడా వివరణ అడుగుతామంటూ నట్టి చెప్పారు.

ఇక తెలంగాణ మంత్రి తలసాని మాట్లాడిన విషయాల మీద కూడా నట్టి ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చిన తరువాత సినిమా ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయింది అంటూ మాట్లాడారు. నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడండి అంటూ, మమ్మల్ని కెసిఆర్, కేటిఆర్ దగ్గరికి తీసుకువెళితే మీరు చిన్న సినిమాలను పట్టించుకోని విషయం లెక్కలతో సహా వివరిస్తాం అంటూ ఫైర్ అయ్యారు. ఈ వేడుకకు ఉపయోగించిన 25 లక్షలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నెత్తిన వేస్తే ఒప్పుకోము అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago