Featured

Producer Pokuri Babu Rao : గన్ తో కాల్పులు ఎందుకు జరిగాయాంటే…: నిర్మాత పోకూరి బాబు రావు

Producer Pokuri Babu Rao : యువతరం కదిలింది సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన పోకూరి బాబు రావు గారిది ఒంగోలు. డైరెక్టర్ టి కృష్ణ గారు ఈయనకు సీనియర్ కావడం వల్ల కాలేజీలోనే పరిచయం. దాదాపు టి కృష్ణ గారు మరణించేవరకు కూడా ఆయనతోనే ఉన్న పోకూరి బాబు రావు గారు ఆయనతోనే పలు విప్లవ సినిమాలను చేసారు. ఎర్ర మందారం, నేటి భారతం, భారత నారి, ప్రజాస్వామ్యం వంటి విప్లవ సినిమాలను చేసిన టి కృష్ణ, పోకూరి బాబురావు ధ్వయం కృష్ణ గారు మరణించాక ఆయన కొడుకు గోపీచంద్ తో కలిసి యజ్ఞం, రణం సినిమాలను చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు.

గన్ తో కాల్పులు… ఏం జరిగిందంటే…

పోకూరి బాబు రావు గారు ఎక్కువగా రాజశేఖర్ గారితో సినిమాలను చేసారు. అన్న సినిమా వాళ్లిద్దరి కాంబినేషన్ లో హిట్ సినిమా. మొదటి నుండి నటుడు రచయిత అయిన పిఎల్ నారాయణ గారితో మంచి అనుబంధం ఉండి చొరవగా మామ అని పిలిచేవారట పోకూరి బాబు రావు గారు. ఒకానొక సినిమా సమయంలో ఆయనను కాల్చడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒంగోలు దగ్గర మారుమూల పల్లెలో షూటింగ్ చేస్తుండగా జూనియర్ ఆర్టిస్ట్లు అందరూ సిద్ధంగా ఉన్నా హీరో రాజశేఖర్ ఇంకా షూటింగ్ కి రాలేదు, ఆ కంగారులో పోకూరి బాబు రావు గారు ఉండగా పి ఎల్ నారాయణ గారు షూటింగ్ కి అవసరమని తెచ్చిన డమ్మీ గన్ తీసుకుని ఒక జూనియర్ ఆర్టిస్ట్ తో వేళాకోళం చేస్తుండగా పోకూరి బాబు రావు గారి దృష్టికి విషయం వెళ్లి జూనియర్ ఆర్టిస్ట్ ని కాకుండా నిన్ను కాల్చాలి మామ అని నారాయణ గారితో అని గన్ తీసుకుని గుండెకు గురి పెట్టారట.

అయితే అనుమానము వచ్చి గన్ గాలి లోకి పేల్చగా అది డమ్మి అని తెలిసాక మళ్ళీ గన్ గొంతు దగ్గర పెట్టి కాలుస్తా అని చెప్తే నారాయణ గారు నీ చేతుల్లో చావడం కంటేనా అల్లుడు అని నిలుచున్నారట. కాల్చగానే గొంతు నుండి రక్తం కారడం మొదలవగానే టెన్షన్ వచ్చింది అయితే అదే సమయంలో హీరో రాజశేఖర్ రావడంతో ఆయన ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ కి తరలించడంతో గండం గడిచింది అని తెలిపారు.

Bhargavi

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

8 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

9 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

9 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

9 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

9 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

9 hours ago