తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాల క్రితం లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి పేరు మారుమోగిపోయింది. అప్పట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందిన విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించేది.
విజయశాంతి, దర్శకుడు టి.కృష్ణ ఇద్దరీ కాంబినేషన్ లో వరుసగా ఆరు సినిమాలు తెరకెక్కాయి. కృష్ణ విజయశాంతి వరసగా నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, వందేమాతరం, దేవాలయం, ప్రతిఘటన, రేపటి పౌరులు వంటి చిత్రాలు వరుసగా రావడంతో ఈ ఇద్దరి గురించి అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించేవి.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక జంట రెండు మూడు సార్లు కలిసి పనిచేస్తే వారిద్దరి మధ్య ఏదో అఫైర్ ఉందన్న వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తుంటాయి. ఈ విధంగా విజయశాంతి, టి.కృష్ణ మధ్య కూడా ఇలాంటి ఆఫర్ ఉందని పేపర్ వాళ్ళు లేని వార్తను సృష్టించి రాశారని, ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రొడ్యూసర్ పోకూరి బాబూరావు గారు వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి తెలియజేశారు.
ప్రతిఘటన సినిమా వంద రోజుల ఫంక్షన్ లో భాగంగా టి.కృష్ణ ఈ విషయం గురించి స్పందిస్తూ వేదికపైనే తనకు విజయశాంతికి మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు. మా ఇద్దరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రాయడం వల్ల మీ కడుపుకు అన్నం దొరుకుతుందనుకుంటే పరవాలేదు రాసుకోండి, లేదంటే ఇకపై ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి లేనిపోని సంబంధాలను కలుపుతూ వార్తలు రాయకండి.
మా ఇద్దరి మధ్య ఈ విధమైనటువంటి సంబంధాలు లేవని ప్రతిఘటన సినిమా వంద రోజుల ఫంక్షన్ లో విజయశాంతితో తనకు ఉన్న సంబంధం గురించి బహిరంగంగా తెలియజేశారనే విషయాన్ని నిర్మాత పోకూరి బాబూరావు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. అప్పట్లో ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అదే స్థాయిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…