Producer Pokuri Baburao : యువతరం కదిలింది సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన పోకూరి బాబు రావు గారిది ఒంగోలు. డైరెక్టర్ టి కృష్ణ గారు ఈయనకు సీనియర్ కావడం వల్ల కాలేజీలోనే పరిచయం, దాదాపు టి కృష్ణ గారు మరణించేవరకు కూడా ఆయనతోనే ఉన్న పోకూరి బాబు రావు గారు ఆయనతోనే పలు విప్లవ సినిమాలను చేసారు. ఎర్ర మందారం, నేటి భారతం, భారత నారి, ప్రజాస్వామ్యం వంటి విప్లవ సినిమాలను చేసిన టి కృష్ణ, పోకూరి బాబురావు ధ్వయం కృష్ణ గారు మరణించాక ఆయన కొడుకు గోపీచంద్ తో కలిసి యజ్ఞం, రణం సినిమాలను చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు.
యజ్ఞం సినిమాకు గోపీచంద్ హీరోగా ఎలా వచ్చాడంటే…
టి కృష్ణ గారితో ఉన్న అనుబంధం వల్ల పోకూరి బాబురావు కుటుంబం అలాగే హీరో గోపీచంద్ కుటుంబం సన్నిహితంగా ఉండేవారట. పోకూరి బాబురావు గారిని బాబాయ్ అంటూ పిలవడం గోపి చంద్ కి అలవాటు. గోపించంద్ మొదటి సినిమా ‘తొలివలపు’ ఫ్లాప్ అయినపుడు నెక్స్ట్ చేయాలని అనుకుంటున్న సమయంలో డైరెక్టర్ తేజ తో ఒక సినిమా చేయించాలని పోకూరి బాబు రావు గారు అనుకున్నారట. తేజ కూడా కృష్ణ గారి వద్ద పనిచేయడం వల్ల ఆయన కొడుకుతో సినిమా చేస్తానని చెప్పడంతో అయన ను అప్పుడప్పుడు కలవమని చెప్పారట. అదే సమయంలో పోకూరి బాబురావు గారు ఆయన నెక్స్ట్ సినిమా కే ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేయాలని అనుకుని ‘యజ్ఞం’ సినిమా స్టోరీ ప్రభాస్ కి చెప్పగా నచ్చి ప్రభాస్ తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ డైరెక్టర్ ను మార్చమని చెప్పారట.
ఆ విషయం నచ్చని పోకూరి గారు సరిగ్గా అదే సమయానికి వచ్చిన గోపీచంద్ ను చూసి ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికాను అనుకుని గోపి ఈ సినిమా చేద్దాం అని స్టోరీ చెప్పగా మొదట డైరెక్టర్ విషయంలో అనుమానపడినా చివరకు గోపీచంద్ యజ్ఞం సినిమా చేశారట. అలా మంచి హిట్ అందుకున్న గోపీచంద్ మరో వైపు విలన్ గా కూడా ఈ గ్యాప్ లో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక మంచి హిట్స్ వచ్చి ‘రణం’ తరువాత మార్కెట్ పెరిగాక గోపి విభిన్నంగా కథలను చేస్తున్నాడని, మా ఇద్దరి కాంబినేషన్ వర్క్ అవుట్ కాలేదని, అయితే నాకు మాత్రం గోపీచంద్ ను ఒక మాస్ క్యారెక్టర్ లో చూడాలని ఉంది అంటూ చెప్పారు పోకూరి బాబు రావు గారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…