Producer Ram Sathyanarayana : సినిమా ఇండస్ట్రీలో కేవలం కష్టపడితేనే కాదు అదృష్టం కలిసివస్తేనే నిలదొక్కుకుంటారు. అది నటించడానికైనా, డైరెక్షన్ అయినా లేక నిర్మాణం అయినా ఏదైనా సినిమా రంగంలో రాణించడం అంత ఈజీ కాదు. ఇక ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ చెప్తున్నారు. ఆయన ప్రస్థానం ఆయనకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విషయాలను నేర్పిదంటూ చెప్పారు. ఆయన సొంతూరు పాలకొల్లు అయితే ఆకివీడు లో బట్టల దుకాణం పెట్టి బాగా సంపాదించిన సత్యనారాయణ గారు సినిమాల మీద ఇష్టంతో మద్రాస్ వెళ్లి సినిమాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకున్నారు. ఇక సత్యనారాయణ గారికి డైరెక్టర్ కోడి రామకృష్ణ మంచి మిత్రుడు అవ్వడం, ఆయన పెళ్లి కూడా దగ్గరుండి అన్ని పనులు చూసుకోవడం వల్ల ఇక నిర్మాతగా వెళ్లాలని అనుకుని మద్రాస్ వెళ్లి అక్కడ అవగాహన లేక సినిమాలో డబ్బు పెట్టి సంపాదించినదంతా కోల్పోయారు. ఇక ఆ తరువాత మళ్ళీ ఆకివీడు తిరిగి వచ్చి భీమవరం వెళ్లిపోయి అక్కడ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డారు.
విష్ణు తో సినిమాకు అడ్వాన్స్ ఇస్తే తిరిగి రాలేదు…
ఇక మళ్ళీ వ్యాపారం లో బాగా సంపాదించాక మళ్ళీ సినిమా మీద గాలి మళ్ళీ ‘ఊహ’ సినిమాకు డబ్బు పెట్టారు. ఈసారి నిర్మాతగా కాకుండా కేవలం పెట్టుబడి పెట్టారు. ఇక సినిమా మంచి విజయం అందుకుని పెట్టిన డబ్బు తిరిగి వచ్చింది. ఇక మళ్ళీ సినిమాలో పెట్టుబడి పెట్టి నిర్మాత అవ్వాలని అనుకుని మద్రాస్ వెళ్లి ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ దగ్గర ఆఫీస్ లో ఉండి ఆయన మాట కాదని ఐదు సినిమాల్లో ఐదు లక్షలు చొప్పున పెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఇక బెల్లం కొండ సురేష్ మంచి మిత్రుడు కావడం వల్ల ఆయన ద్వారా మోహన్ బాబు గారి అబ్బాయి మంచు విష్ణుని హీరోగా లాంచ్ చేస్తున్న సమయంలో నెక్స్ట్ చిత్రంకి డబ్బు పెట్టు అని బెల్లం కొండ సలహా ఇచ్చారట.
జయంత్ సి పరంజి దర్శకుడు అంటూ చెప్పి మోహన్ బాబు వద్దకు వెళ్లి మంచు విష్ణు కి ఐదు లక్షలు అడ్వాన్స్ సినిమా కోసం ఇచ్చారు. ఇక ఆ తరువాత గొడవలు జరిగి ఆ సినిమా పట్టాలెక్కలేదు నా అడ్వాన్స్ డబ్బు తిరిగి రాలేదు ఇప్పటివరకూ అంటూ రామ్ సత్యనారాయణ చెప్పారు. ఇక మనవల్ల సినిమా అది అవ్వదు మోసపోతూనే ఉన్నాను అని ఊరు వెళ్ళిపోదామని అనుకునే సమయంలో తెలిసిన స్నేహితుడు నువ్వు డబ్బు పెట్టకు సినిమా ఎలా తీస్తారో చూడు ఆ తరువాత సినిమా తీయి అని సలహా ఇచ్చాడు అని తన అనుభవాలను పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…