శరత్ మరార్.. ఈయనను టాలీవుడ్ నిర్మాత అనడం కన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అనడం బెటర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో గతంలో గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు సినిమాలను నిర్మించాడు శరత్ మరార్. ఆ సినిమాలు ఆశించినంత లాభాలు తెచ్చి పెట్టకపోయినా శరత్ కు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆ చిత్రాలను ముందే బిజినెస్ చేసేసుకుని సేఫ్ జోన్ లోనే ఉన్నాడు.
అయితే తెలుగులో ఒక్క పవన్ కళ్యాణ్ తో తప్ప మిగతా హీరోలతో సినిమాలు నిర్మించేలా కనబడటం లేదు శరత్. పైగా ఈ మధ్య పవన్ స్టార్ తో కాస్త దూరంగానే ఉంటూ మరో దారి చూసుకుంటున్నాడు శరత్ మరార్. కరోనా లాక్ డౌన్ పూర్తయ్య్యాక డబ్బింగ్ సినిమాలను ఇక్కడ తన బ్రాండ్ ఇమేజ్ తో విడుదల చేసే ప్రయత్నంలో వున్నాడు శరత్.
ఇక అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సామాన్య ప్రజల సమస్యలపై పోరాడేటప్పుడు అటు సినిమాలలోనైనా.. ఇటు రాజకీయ రంగంలోనైనా తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేసే మనిషనే విషయాన్ని ఆయన ఫ్యాన్స్, అలాగే ఆయనతో పరిచయం ఉన్న ప్రముఖులందరూ చెప్పే మాట. అలాగే మనీకి కూడా అయన పెద్దగా విలువ ఇవ్వరని, స్నేహానికే ఎక్కువగా విలువ ఇస్తూ సినిమాలలో నటించేవారని, అవసరమనిపిస్తే ఉన్నదంతా దానం చేసేయడానికి కూడా వెనకాడని మంచి మనిషిగా మన పవర్ స్టార్ కి మంచి గుర్తింపు వుంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా సార్లు ఫైనాన్షియల్ గా ఇబ్బందులను ఎదుర్కొన్నారనే రూమర్స్ కూడా ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువై పోయాయి. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ సినీ నిర్మాత శరత్ మరార్ దగ్గర ప్రస్తావించగా ‘పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఏదో ఒకరకమైన ఫైనాన్షియల్ సమస్యల్లో ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఆయన మనీకి అంత విలువ ఇవ్వరు. అలాగే ఏ సమస్యలకి ఆయన భయపడరు, దేనికైనా ఎదురెళ్లి పోరాడే మనస్తత్వం ఆయనది. సమస్యలున్నాయి కదాని డబ్బు కోసం సినిమాలు చెయ్యరు. సినిమాకి మూలాధారమైన కథ, ఆ కధను చెబుతున్న విధానం, అంతకన్నా ముందు తను నటించేబోయే చిత్ర దర్శకుడి వ్యక్తిత్వం నచ్చితేనే చేస్తారు. ఆయనతో కలిసి పని చేయడం వలనే సినిమా అనేదాని గురించి లోతుగా తెలుసుకోగలిగాను, ఆ అనుభవమే ఇప్పుడు నా కెరీర్ కి ఉపయోగపడుతోంది.” అని శరత్ మరార్ తెలియ జేయడం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…