Categories: FeaturedMovie News

బాలీవుడ్ లోని నెపోటిజంపై తనదైన స్టైల్ లో సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ టాప్ హీరో గోవిందా!!

సుశాంత్ వివాదంతో బాలీవుడ్‌ లో నెపోటిజంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సల్మాన్ ఖాన్‌ తో పాటు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలి వంటి ప్రముఖులపై భారీగానే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ టాప్ హీరో గోవిందా బాలీవుడ్ ఇండ్రస్ట్రీ మొత్తం నలుగురైదుగురు చేతుల్లోనే ఉందంటూ బాలీవుడ్‌ లోని నెపోటిజం పై సంచలన కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుశాంత్ బలవాన్మరణం తరువాత బాలీవుడ్ లో నిరసనలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరో గోవిందా తనదైన శైలిలో మీడియా ముందు నోరు విప్పారు.

బాలీవుడ్‌ ను బడా ప్రముఖులు మాత్రమే శాసిస్తున్నారని‌, ఒకప్పుడు తన సినిమాలను కూడా థియేటర్లో సరిగా విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడిందని, బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువగా ఉండటం వల్లనే నిజమైన ప్రతిభ ఉన్న ఎంతోమంది నటీనటులు ఇప్పుడు సినిమా రంగంలో రాణించలేకపోతున్నారని, రోజురోజుకు ఇండస్ట్రీలో ప్రతిభకు ప్రాధాన్యత తగ్గిపోతుందని, నెపోటిజం కారణంగా ఎంతోమంది టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోతున్నారని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా గత జ్ణాపకాలను గుర్తు చేసుకుంటూ హీరో గోవిందా..

“తన తల్లిదండ్రులు నిర్మలాదేవి, అరుణ్ కుమార్ లు కూడా సినీ ఇండ్రస్ట్రీకి సంబంధించినవారైనప్పటికీ తనకు మాత్రం ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయన్నారు. నటుడిగా నిరూపించుకునేందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవలసి వచ్చిందని తెలియజేశారు. ఇప్పటికే బాలీవుడ్ లో నెలకొన్న నెపోటిజంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న టైంలో తాజాగా హీరో గోవిందా చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి మరింత సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago