సుశాంత్ వివాదంతో బాలీవుడ్ లో నెపోటిజంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలి వంటి ప్రముఖులపై భారీగానే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ టాప్ హీరో గోవిందా బాలీవుడ్ ఇండ్రస్ట్రీ మొత్తం నలుగురైదుగురు చేతుల్లోనే ఉందంటూ బాలీవుడ్ లోని నెపోటిజం పై సంచలన కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుశాంత్ బలవాన్మరణం తరువాత బాలీవుడ్ లో నిరసనలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరో గోవిందా తనదైన శైలిలో మీడియా ముందు నోరు విప్పారు.

బాలీవుడ్ ను బడా ప్రముఖులు మాత్రమే శాసిస్తున్నారని, ఒకప్పుడు తన సినిమాలను కూడా థియేటర్లో సరిగా విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడిందని, బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువగా ఉండటం వల్లనే నిజమైన ప్రతిభ ఉన్న ఎంతోమంది నటీనటులు ఇప్పుడు సినిమా రంగంలో రాణించలేకపోతున్నారని, రోజురోజుకు ఇండస్ట్రీలో ప్రతిభకు ప్రాధాన్యత తగ్గిపోతుందని, నెపోటిజం కారణంగా ఎంతోమంది టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోతున్నారని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా గత జ్ణాపకాలను గుర్తు చేసుకుంటూ హీరో గోవిందా..

“తన తల్లిదండ్రులు నిర్మలాదేవి, అరుణ్ కుమార్ లు కూడా సినీ ఇండ్రస్ట్రీకి సంబంధించినవారైనప్పటికీ తనకు మాత్రం ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయన్నారు. నటుడిగా నిరూపించుకునేందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవలసి వచ్చిందని తెలియజేశారు. ఇప్పటికే బాలీవుడ్ లో నెలకొన్న నెపోటిజంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న టైంలో తాజాగా హీరో గోవిందా చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి మరింత సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.



























