Categories: FeaturedMovie News

సౌతిండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ దగ్గర ఎన్ని కార్లున్నాయో తెలుసా.?

స్టైల్‌ కి ప్రతిరూపం రజనీ కాంత్.. లైఫ్ లో ఎంతటి సీరియస్ సంఘటనలు ఎదురైనా వాటన్నింటినీ సరదాగా చిరునవ్వుతో స్వీకరించే ఓ సాదాసీదా వ్యక్తి మన సూపర్‌ స్టార్. కోట్ల రూపాయల సిరి సంపదలు ఉన్నా సరే నేటికీ సింపుల్‌గా జీవించడం ఒక్క రజనీ కాంత్‌కే చెల్లుతుంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లనే తేడా లేకుండా ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మన టాలీవుడ్ బాషా తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను తనదైన శైలిలో దోచుకుంటూ ఎన్నో సందేశాత్మక చిత్రాల్లో నటించారు.

ఓ సామాన్య బస్ కండక్టర్ స్ధాయి నుండి తన కెరీర్‌ను ప్రారంభించి, నేడు యావత్ ప్రపంచం గుర్తించదగిన సూపర్‌‌ స్టార్ స్థాయికి ఎదిగాడు మన టాలీవుడ్ శివాజీ. రజనీ కాంత్ తన హోదాతో సంబంధం లేకుండా ఎప్పుడూ సామాన్య జీవితాన్నే ఇష్టపడతారు. అదే రజనీకాంత్ హోదాలో వేరే ఎవరైనా ఉండుంటే ఈపాటికి కోట్లు ఖరీదు చేసే కార్లలో సరదాగా షికార్లు చేస్తుండేవారు. ఇక అసలు విషయానికి వస్తే.. సింప్లిసిటీకి నిలువెత్తు రూపమైన మన రజనీ కాంత్ తన జీవితంలో ఉపయోగించిన కార్లేంటో, వాటి కథేంటో ఇప్పుడు చదివి తెలుసుకోండి.!

ప్రీమియర్ పద్మిని

అప్పట్లో అత్యంత పాపులరైన ఫియట్ ప్రీమియర్ పద్మిని కారును రజనీకాంత్ 1980 నుంచి 1990 కాలంలో ఉపయోగించారు.

అంబాసిడర్

అత్యంత సౌకర్యవంతమైన అంబాసిడర్ కారులో రజనీ కాంత్ షూటింగ్‌ లకు వెళ్లేవారు. ఈ కారును 1990-2000 కాలంలో ఉపయోగించారు.

హోండా సివిక్

ఆ తర్వాత మారుతున్న కాలానుగుణంగా రజనీ కాంత్ ఓ హోండా సివిక్ కారును ఉపయోగించారు.

టొయోటా ఇన్నోవా

ప్రస్తుతం రజనీకాంత్ ఓ టొయోటా ఇన్నోవా MPV ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

BMW X5

గతంలో షారుఖ్ ఖాన్ నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘రావన్‌’ లో గెస్ట్ రోల్ లో నటించినందుకు గాను, రజనీ కాంత్‌కు షారుఖ్ ఖాన్ ఓ BMW X5 కారును కానుకగా ఆఫర్ చేశారని, అయితే ఆ బహుమతిని రజనీ స్వీకరించలేదని బాలీవుడ్ సమాచారం. ఇక తాజాగా సౌతిండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. తెల్లని కుర్తా పైజామా ధరించి తనదైన స్టైల్‌లో లంబోర్గిని కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా అది ఫ్యాన్స్ కళ్లలో పడింది. వెంటనే తమ మొబైల్ ఫోన్లలో రజనీకాంత్ ఫోటోలను, ఆయన కారు డ్రైవ్ చేస్తున్న వీడియోని చిత్రీకరించారు. తన కూతురుకు సంబంధించిన అంత్యంత ఖరీదైన లాంబోర్గినీ కారునే రజనీ డ్రైవ్ చేస్తూ వెళ్లారని కోలీవుడ్ సమాచారం. ఈ సందర్బంగా ఆయన మాస్క్ కూడా ధరించారు. ప్రస్తుతం రజనీ దగ్గర పైన ఉదహరించిన కార్లే కాకుండా ఇంకా మెర్సిడెస్‌ బెంజ్‌ జి క్లాస్‌, రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌, రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ వంటి సూపర్‌ కార్లు ఉన్నాయి. ఈమధ్య కరోనా వైరస్‌ కారణంగా రజనీ కాంత్‌  ఇంటికే పరితమైయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రజనీ కాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో గత ఏడాది చివర్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘అన్నాత్తే’ అని టైటిల్‌ కూడా ప్రకటించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago