సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత 3వ పెళ్లి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రోజులు గడుస్తున్నా నేటికీ ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చేలా లేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెల్, టీవీ ఛానెల్స్‌లో మాటల యుద్ధం భయంకరంగా కొనసాగుతున్నది. లక్ష్మీ రామకృష్ణన్, కుట్టి పద్మిని, కస్తూరి శంకర్ మొదలైన కోలీవుడ్ సెలబ్రిటీలందరూ వనితా విజయ్ కుమార్ పై ఘాటుగానే విమర్శలు చేస్తుంటే.. వనిత ఆ విమర్శలకు ధీటుగానే స్పందిస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈమధ్య ఓ టీవీ షో లైవ్ లో వనితా విజయకుమార్ రెచ్చిపోయి బూతులు మాట్లాడటంతో కోలీవుడ్ ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. తాజాగా లక్ష్మీ రామకృష్ణన్, వనితలు ఒక లైవ్ షోలో పాల్గొన్నారు. వీళ్ళిద్దరి మధ్య వనితా 3వ పెళ్ళికి సంబంధించిన చర్చ వేడి వేడిగా సాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనేంత రేంజ్ లో మాటల యుద్ధం జరిగింది. ఆ లైవ్ షోలోనే లక్ష్మీ రామకృష్ణన్ ను మాట్లాడనివ్వకుండానే వనిత రెచ్చి పోయింది.
“నేను పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన సమస్య ఏమిటి.? ఏవో వ్యక్తిగత కారణాల వల్ల గతంలో నా మాజీ భర్తలకు విడాకులిచ్చాను. అయినా నన్ను తప్పు పట్టడానికి నువ్వేమైనా మద్రాస్ హైకోర్టు జడ్జ్ అనుకుంటున్నావా.? ఒక్క భర్తతో సంసారం చేసినంత మాత్రాన నువ్వేమైనా పతివ్రతవనుకుంటున్నావా.? నా మాజీ భర్తలతో నేను కలిసి ఉన్నప్పుడు నీతిగా, నిజాయితీగానే వున్నాను. నీలాగా భర్తను మోసం చేయలేదు. నీవున్న సినిమా రంగంలోనే నేనూ వున్నాను. నీ బండారం అంతా నాకు తెలుసు. నాతో పెట్టుకుంటే నీ శృంగార లీలలన్నీ బయట పెడతాను” అంటూ లక్ష్మీ రామకృష్ణన్ పై నిప్పుల వర్షం కురిపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది వనితా విజయ్ కుమార్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…