“ఒక్క భర్త తో ఉంటే నువ్వేమయినా పతివ్రతవా..?” లైవ్ లో మరో నటిపై రెచ్చిపోయిన వనితా విజయ్ కుమార్!!

0
418

సీనియర్‌ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత 3వ పెళ్లి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రోజులు గడుస్తున్నా నేటికీ ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చేలా లేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెల్, టీవీ ఛానెల్స్‌లో మాటల యుద్ధం భయంకరంగా కొనసాగుతున్నది. లక్ష్మీ రామకృష్ణన్, కుట్టి పద్మిని, కస్తూరి శంకర్ మొదలైన కోలీవుడ్ సెలబ్రిటీలందరూ వనితా విజయ్ కుమార్ పై ఘాటుగానే విమర్శలు చేస్తుంటే.. వనిత ఆ విమర్శలకు ధీటుగానే స్పందిస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈమధ్య ఓ టీవీ షో లైవ్ లో వనితా విజయకుమార్ రెచ్చిపోయి బూతులు మాట్లాడటంతో కోలీవుడ్ ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. తాజాగా లక్ష్మీ రామకృష్ణన్, వనితలు ఒక లైవ్ షోలో పాల్గొన్నారు. వీళ్ళిద్దరి మధ్య వనితా 3వ పెళ్ళికి సంబంధించిన చర్చ వేడి వేడిగా సాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనేంత రేంజ్ లో మాటల యుద్ధం జరిగింది. ఆ లైవ్ షోలోనే లక్ష్మీ రామకృష్ణన్‌ ను మాట్లాడనివ్వకుండానే వనిత రెచ్చి పోయింది.

“నేను పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన సమస్య ఏమిటి.? ఏవో వ్యక్తిగత కారణాల వల్ల గతంలో నా మాజీ భర్తలకు విడాకులిచ్చాను. అయినా నన్ను తప్పు పట్టడానికి నువ్వేమైనా మద్రాస్ హైకోర్టు జడ్జ్ అనుకుంటున్నావా.? ఒక్క భర్తతో సంసారం చేసినంత మాత్రాన నువ్వేమైనా పతివ్రతవనుకుంటున్నావా.? నా మాజీ భర్తలతో నేను కలిసి ఉన్నప్పుడు నీతిగా, నిజాయితీగానే వున్నాను. నీలాగా భర్తను మోసం చేయలేదు. నీవున్న సినిమా రంగంలోనే నేనూ వున్నాను. నీ బండారం అంతా నాకు తెలుసు. నాతో పెట్టుకుంటే నీ శృంగార లీలలన్నీ బయట పెడతాను” అంటూ లక్ష్మీ రామకృష్ణన్‌ పై నిప్పుల వర్షం కురిపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది వనితా విజయ్ కుమార్.