సినిమా హిట్టు, ఫట్టు మాట పక్కన పెడితే… నిర్మాత అనేవాడు లేనిదే సినిమా ఉండదు.. సినిమా హిట్ అయ్యాక నిర్మాతకు అన్ని లాభాలు వచ్చాయి అని మాట్లాడుకుంటాం గానీ అసలు ఆ సినిమా తీయడానికి నిర్మాత పడే కష్టాలు అన్ని ఇన్ని కావు.. అయితే టాలీవుడ్ లో నిర్మాతలను అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్ తో సినిమా తీసి నిర్మాతను కాపాడే డైరెక్టర్లు కొందరు ఉన్నా.. మరి కొందరు మాత్రం సినిమా మొదట్లో అనుకున్న బడ్జెట్ కి, సినిమా అయిపోయాక పెట్టిన ఖర్చుకి పొంతలేనతగా పెంచుకుంటూ పోతారు. డైరెక్టర్ల సంగతి అటుంచితే… నిర్మాతలకు నటీనటులతో కూడా బాగా చిక్కొచ్చిపడుతుంది. వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక లబో దిబో మంటున్న నిర్మాతలు చాలానే ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో లోకల్ నటులకంటే పరభాషా నటులకు మన వారు పెద్ద పీట వేస్తున్నారు కదా… ఇక ఈ కస్టాలు ఇంకా పెరిగిపోయాయి. ముఖ్యంగా హీరోయిన్లు, వారి ఫ్లైట్ టికెట్స్ నుంచి, వారు బస చేసే హోటల్, తినే తిండి వరకు కూడా నిర్మాతలు కట్టాల్సిందే.. ఇక్కడ హీరోయిన్ ఒక్కతే అనుకుంటే పొరపాటే… హీరోయిన్ తో పాటు వారి బంధువులు కూడా వస్తుంటారు.. వారికీ, ఆ హీరోయిన్ కి సంబందించిన పర్సనల్ ఎంప్లాయిస్ వరకు నిర్మాత భరించాల్సిందే.
అయితే తాజాగా ఈ హీరోయిన్.. కేవలం తాను తినే తిండి కోసం ఏడువేల రూపాయిలు ఖర్చు పుట్టిస్తుందట..అది రోజుకి అనుకుంటున్నారా? కాదు అంది బాబు… ఒక పూటకి… ఇంతటితో ఆగలేదట ఈ అమ్మడు. తాజగా ఆమె బట్టల లాండ్రీ బిల్లు కూడా నిర్మాతకి అంటగట్టిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు మన పంజాబీ భామ మెహ్రిన్. మెహ్రిన్ పంపిన లాండ్రీ బిల్లు దేముంది మహా అయితే రెండు, మూడు వేలు అయివుంటాయి అనుకున్న నిర్మాతకు ఆబిల్లు చూసే సరికి కళ్ళు బైర్లు కమ్మాయట. ఇంతకీ ఆ బిల్లులో ఏ ముందననే కదా.. అదేనండి అక్షరాలా యాబై వేల రూపాయిలు బిల్ అయిందట. ఈ షాక్ నుంచి తేరుకోవడానికి ఆ నిర్మాతకీ చాలా టీమ్ పట్టిందట. ఇలా ఆమె వ్యక్తిగాత ఖర్చులను కూడా నిర్మాతలకు అంటిస్తుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. పోనీ ఆమె ఏమయినా హిట్ ఇస్తుందా అంటే అదీలేదు. అసలే బొక్కల్లో ఉన్న నిర్మాతలకి ఆమె వ్యక్తిగత ఖర్చులు పెట్టిస్తుంటే కాలిపోతుందట. అయినా ప్రసుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత వల్ల భరించాల్సి వస్తుందట. మొత్తానికి ఈ అమ్మడు చేసే ఖర్చులకి నిర్మాతలకు తడిసి మోపెడవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…