టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పేరుకి టాప్ హీరోలు కానీ వారితో నటించడానికి హీరోయిన్లే దొరకడం లేదు. అందులోను నందమూరి నటసింహం బాలకృష్ణ కు మరీ కష్టంగా మారింది. బాలయ్య నటియించిన గత చిత్రాలనుంచి ఈ ప్రోబ్లం ఉంది. గత మూడు, నాలుగు సినిమాలనుంచి బాలయ్యకు హీరోయిన్ల కష్టాలు తొలగిపోవడం లేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, సరైన హీరోయిన్లు దొరకక అవుట్ డేటెడ్ హీరోయిన్లను బాలయ్య సరసన నటింపజేస్తున్నారు. సోనాలి చౌహన్ బాలయ్య సరసన నటించడం ఇది మూడోసారి. అయితే బాలకృష్ణ – బోయపాటి కాంబినేషలో రాబోతున్న సినిమాలో శ్రీయ, నయనతార ఇద్దరు భామలు నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అయితే తాజాగా ఇదే పరిసితి ఎదురవుతుంది మరో టాలీవుడ్ టాప్ హీరో.. టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. సినిమాలు చేయను అని పాలిటిక్స్ చేసుకుంటూ.. మళ్ళి హఠాత్తుగా రీఎంట్రీ ఇచ్చి సినిమాల మీద సినిమాలు సైన్ చేసుకుంటూ దూకుడు మీద ఉన్న పవన్ కు హీరోయిన్ల రూపంలో చుక్కెదురవుతుంది. ఏకంగా 5 సినిమాలు కమిట్ అవుతున్న పవన్ ను హీరోయిన్ల బెడద పట్టుకుంది. మొన్ననే బాలీవుడ్లో హిట్ల మీద హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ కైరా అద్వానీని అడిగినా ఆమె కూడా డేట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు పూజ హెగ్డే కూడా పవన్ చేయనని నిర్మొహమాటంగా చెప్పేసిందట. ఏమయిందో ఏమో అద్భుతమైన అవకాశం నాకొద్దని చెప్పేసిందట ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ లో భారీ హిట్ అందుకున్న “పింక్” చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణి కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి “వకీల్ సాబ్” అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. అయితే ఈ వకీల్ సాబ్ కోసం పూజ ని అడిగితే కుదరదని చెప్పిందట. పవన్ కి వయస్సు అయిపోయింది అని అనుకుంటుందో లేక ఈ కథ నచ్చలేదో మొత్తానికి పవన్ తో నటించాను అని తేల్చి చెప్పేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…