సినిమా వాళ్లంటే అభిమానులకు చాల క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కోసమే చాలామంది నటులవ్వాలని ఆశ పడుతుంటారు. తమను అభిమానించే వారికోసం సినిమాల్లో నటిస్తూ రెండు చేతుల డబ్బు కూడా సంపాదించవచ్చు అంటుకుంటారు. దాదాపు హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఇదే చేస్తారు. కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న టాలీవుడ్ లో ముక్యంగా సౌత్ ఇండియాలో పలు భాషల్లో మంచి పేరు ఉన్న హీరోయిన్స్ అయినప్పటికీ సినిమాలు డబ్బు క్రేజ్ అన్ని వదులుకొని సన్యాసుల్లా జీవిస్తున్నారు. ఆధ్యాతికత వైపు అడుగులు వేసి తమలోని స్పిరిచువల్ భావాలను ప్రపంచానికి చాటి చెప్తున్నారు. మరి వద్దంటే వచ్చి పడే డబ్బును కాదనుకొని జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు నడిపించుకుంటున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
మొదటగా గీతాంజలి సినిమాతో నాగార్జున సరసన హీరోయిన్ గా పరిచయం అయినా గిరిజ.. తొలి సినిమాతోనే హీరోయిన్ గా చెరగని ముద్ర వేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. తర్వాత ‘హృదయాంజలి’ అనే సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమైపోయింది. అది కూడా సినిమాలంటే పెద్దగా ఇష్టంలేకే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే, బ్రిటన్ లో పుట్టి పెరిగిన గిరిజ చదువైపోయాక భరతనాట్యం నేర్చుకోవడానికి ఇండియా వచ్చి అనుకోకుండా హీరోయిన్ అయ్యింది ఆ తర్వాత కొన్నాళ్లకే మనస్సు మార్చుకొని సినిమాల నుండి తప్పుకొని ఆధ్యాత్మికత వైపు మాలి పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంలో చేరింది. సినిమాలు ముఖ్యమా ఆధ్యాత్మికత ముఖ్యమా అనే మీమాంస లో ఉన్నప్పుడు ఆమె సినిమాలకు గుడ్ bye చెప్పి ఆశ్రమంలో చేరింది.
ఇక ఇలాగే మరొక హీరోయిన్ హీరా..పూర్తి పేరు హీరా రాజగోపాల్…చెన్నై కి చెందిన హీరా తెలుగులో ఆహ్వానం, అల్లుడుగారు వచ్చారు, లిటిల్ సోల్జర్స్ వంటి సినిమాల ద్వారా అందరికి సుపరిచితమే. తమిళ్ మలయాళం కన్నడ హిందీ చిత్రాల్లో యాభై కి పైగా చిత్రాల్లో నటించిన హీరా ఒక స్టార్ హీరో ప్రేమలో పడి మోసపోవడం తో ఇండస్ట్రీ ని వదిలేసి పెళ్లి చేసుకున్నారు. కానీ అదికూడా పట్టుమని నాలుగేళ్లు కూడా సజావుగా సాగకపోవడం తో జీవితం పై విరక్తి తో ఆధ్యాత్మికతను జీవనమార్గం గా ఎంచుకున్నారు. మరో పెళ్లి ఆలోచన కూడా చేయకుండా తన జీవితాన్ని పూర్తి ఆథ్యాత్మికంగానే గడపడానికి నిశ్చయించుకున్నారు.
ఇక ఆ తర్వాత నటి రమాప్రభ. టాలీవుడ్ లెజెండ్ కమెడియన్ అయినా రమాప్రభ జీవితం అందరికి తెరిచినా పుస్తకమే. జీవితం లో ఎంతో ఎత్తుకు వెళ్లిన పెళ్లి కారణం గా అన్ని పోగొట్టుకొని విడాకులు తీసుకొని అన్ని వదిలేసి టాలీవుడ్ పెద్దల డొనేషన్స్ తో రమాప్రభ ప్రస్తుతం చివరి రోజులు వెళ్లదీస్తున్నారు. ఆమె తెల్లవారింది మొదలు నిద్రపోయే వరకు ఒక్క ఆధ్యాత్మిక చింతన తప్ప మరొక ఆలోచన ఉండదు.
ఇక మరొక హీరోయిన్ కృతి కర్బందా. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి కి సైతం ఆధ్యాత్మిక బావాలు చాల ఎక్కువ. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న కృతి మొన్న ఆ మాద్య సినిమా కోసం లండన్ షూటింగ్ కు వెళ్ళింది. మధ్యలో ఈమూవీకి బ్రేక్ రావడంతో అందరూ లండన్ చుట్టుపక్కల ప్రాంతాలను చూడటానికి వెళ్ళిపోతే ఆమె మాత్రం లండన్ లోని ఒక గురు ద్వారాని శుభ్ర పరుస్తూ తన ఆధ్యాత్మికతను చాటుకుంది. ఏ మాత్రం కాళీ సమయం దొరికిన దైవ సేవ చేయడం ఆమెకు అలవాటు.
ఇక వీరే కాకుండా ఇంతకుముందు కొంత మంది హీరోయిన్స్ ఏకంగా సన్యాసం పుచ్చుకున్నారు కూడా. మనీషా కొయిరాలా, సుచిత్ర సేన్, బిగ్ బాస్ సోఫియా హయత్, మమతా కులకర్ణి, బర్ఖ మదన్ వంటి హీరోయిన్స్ పూర్తిగా సన్యాసం పుచున్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న హీరోయిన్స్ అంత కూడా జీవితంలో ఒక రకమైన వెలితి అశాంతత కుటుంబ పెళ్లి ప్రేమ సమస్యలతో కొట్టుమిట్టాడి చివైరికి ఆధ్యాతిక చింతనలో ప్రశాంతతను వెత్తుకున్నారు .
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…