Categories: FeaturedMovie News

సినిమాలను వదిలేసి టాప్ కంపెనీలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు హీరోయిన్స్ !!

సినిమా..ఏ భాషలో అయినా ఇదొక రంగుల ప్రపంచమే. ఒక్కసారి ఈ ప్రపంచం లోకి అడుగుపెట్టాక బయటకు వచ్చే దారి ఉండదు. సెలబ్రిటీ లైఫ్ స్టైల్ చుసిన వారు ఎవ్వరైనా అలాంటి జీవితమే ఎల్లప్పుడూ కోరుకుంటారు. ముక్యంగా హీరోయిన్స్ అయితే ఆ కలల ప్రపంచం లేకుండా జీవించలేరు. కానీ హీరోయిన్స్ లైఫ్ మహా అయితే ఒక పదేళ్లు ఇండస్ట్రీ లో ..అంత కన్నా అంటే అక్క వదిన అమ్మ పాత్రలు చేయాలి. పెళ్లయిందా ఇంకా నటనకు ఫుల్ స్టాప్ పెట్టి సంసారం జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. కొంత మంది హీరోయిన్స్ మాత్రం భర్తలతో బిజినెస్ లు లేదంటే వారికి నచ్చిన ఏదైనా ప్రొఫషన్ కి మారిపోతారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్స్ మాత్రం అలా కాదు. నటనలో స్టార్ డం చూసి ఆ తర్వాత పెళ్ళై పిల్లలు ఉన్న కూడా భర్త పైన లేదంటే కుటుంబం పైన ఆధారపడకుండా తమకంటూ మరొక కొత్త ఐడెంటిటీ ని సృష్టించుకొని ప్రపంచమే తమను మెచ్చుకునేలా దీటుగా మరొక రంగంలో రాణిస్తున్నారు. టాలీవుడ్ నుండి అలా దూరం అయ్యి వరల్డ్ బెస్ట్ కంపెనీ లలో కీలక బాధ్యతలు తమ భుజాన వేస్తూ తాము సినిమాల్లో నటించే బొమ్మలము మాత్రమే కాదు చదువు ఇచ్చిన జ్ఞానం తో ప్రపంచాన్నే జయించగలం అని నిరూపిస్తున్నారు. ఆలా సినిమా రంగం వదిలేసి కెలక ఉద్యోగాలు చేస్తున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.

Actress Manya

మొదటగా మాన్య. నాగార్జున హరికృష చెల్లిగా సీతారామరాజు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది మాన్య. మాయదారి మైసమ్మ పాటతో మంచి ఫాన్స్ ని కూడా సంపాదించుకుంది ఈ రెండు సినిమాల హిట్ తర్వాత తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో మొత్తంగా 41 సినిమాల్లో నటించింది. పెళ్లి చేసుకొని ప్రస్తుతం న్యూ యార్క్ లో ఉంటున్న మాన్య నాలుగేళ్ళ కూతురికి అమ్మ కూడా. కానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినా బ్యాంకింగ్ సంస్థ అయినా jp morgan chase కంపెనీ లో కీలక బాధ్యతల్లో ఉంది. నటన నుండి నేరుగా ఫైనాన్స్ రంగం లో స్థిరపడిందిమాన్య. ప్రస్తుతం మాన్య ఎందరికో ఆదర్శం.

Actress Mayuri Kango

ఇక ఇదే దోవలో ప్రయాణిస్తున్న మరో నటి మయూరి కాంగో..మహేష్ బాబు వంశి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మయూరి బాలీవుడ్లో చాల చిత్రాల్లో నటించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న ఈ బ్యూటీ సినిమాలపై మక్కువతో చదువును వదిలేసింది. ఆ తర్వాత అజయ్ దేవగన్, అనుపమ్ ఖేర్, అర్షద్ వార్సీ, శక్తికపూర్, బాబీ డియోల్, రాణి ముఖర్జి, చంద్రచూడ్ సింగ్, జుగల్ హన్స్‌రాజ్‌తో కలిసి నటించారు.. వెండితెరపైన సరైన అవకాశాలు రాకపోవడంతో కొన్నాళ్లు బుల్లితెరపైన అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా సినిమాలను వదిలేసిన మయూరి కాంగో న్యూయార్క్‌లోని జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ ఫైనాన్స్ విద్యను అభ్యసించారు. ప్రస్తుతం గుర్‌గావ్‌లో నివసిస్తున్న మయూరి కాంగో గూగుల్ ఇండియాలో టాప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను చేపట్టింది.

Actress Aparna, Courtesy by TV9

మరొక హీరోయిన్ అపర్ణ. వెంకటేష్ నటించిన సుందరకాండ చిత్రం గుర్తుందిగా… అందులో వెంకటేష్‌ను ఆటపట్టించే ఒక టీనేజ్ అమ్మాయి పాత్రలో నటించిన నటి పేరే అపర్ణ. ఆ సినిమా తరువాత ఆమె మరలా ఏ ఇతర చిత్రంలోనూ నటించలేదు. 2002లో శ్రీకాంత్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. అప్పటికే ఇండియాలో చైల్డ్ సైకాలజీలో విద్యను అభ్యసించిన పెళ్లయ్యాక అమెరికాలో డబల్ మాస్టర్స్ చేసి అక్కడ ఒక టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో సైకాలజీ లో ఏడేళ్లుగా ఎంతో మందిని తీర్చుదిద్దుతున్నారు.

Actress Swetha Yamini

ఇక ఇదే తరహాలో జయం చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా యామిని సైతం చదువుల్లో మొదటి నుండి ముందుండేది అందుకే హీరోయిన్ గా అవకాశాలు వద్దనుకుని మొదట క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా విప్రో లో జాబ్ చేసింది ఆ తర్వాత మాస్టర్స్ అమెరికాలోనే పూర్తి చేసి ఆ తర్వాత వరల్డ్ నెంబర్ వన్ సంస్థ అయినా యూనియన్ బెస్ట్ ట్రేడ్ కంపెనీ లో ఉద్యోగం చేసింది. కానీ కొన్ని కారణాల చేత పెళ్లయ్యాక ఫామిలీ బిజినెస్ ని తన భుజాలపై మోస్తుంది శ్వేతా. ఇవ్వండి నటన వదిలి హీరోయిన్స్ చేస్తున్న, చేసిన కీలక ఉద్యోగాలు.

వీరి ఫొటోస్ మీకోసం

Actress Manya
Actress Swetha Yamini
Actress Swetha Yamini
Actress Swetha Yamini
Actress Swetha Yamini
Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago