Shivaji Ganesan: శివాజీ గణేషన్ కుటుంబంలో ఆస్తి వివాదం.. నటుడు ప్రభు పై ఫిర్యాదు చేసిన శివాజీ కూతుర్లు?
Shivaji Ganesan: ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీని శాసించిన దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈయన తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాజీ గణేషన్ మరణించి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది.
ఇకపోతే శివాజీ గణేషన్ వారసులుగా ఇండస్ట్రీలోకి హీరో ప్రభు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అలాగే మరొక కుమారుడు రామ్ కుమార్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా శివాజీ గణేష్ వారసులుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుటుంబంలో ప్రస్తుతం ఆస్తి వివాదాలు చెలరేగాయి.
శివాజీ గణేషన్ మరణించి రెండు దశాబ్దాలు అయిన తరువాత ఈ విధంగా ఈ కుటుంబంలో ఆస్తి వివాదాలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తమకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తులను ఇవ్వకుండా మోసం చేశారని శివాజీ కూతుర్లు శాంతి, రాజ్వీ తన సోదరులు ప్రభు రామ్ కుమార్ లపై ఫిర్యాదు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.తమ తండ్రి మరణం తర్వాత ఏకంగా 271 కోట్ల రూపాయల ఆస్తులను సరిగా పంచకుండా అన్యాయం చేశారని వీరు ఆరోపించారు.
తమకు తెలియకుండానే కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకున్నారని అయితే అలా అమ్ముకోవడం చెల్లదని కోర్టు ప్రకటించాలి అంటూ వీరి పిటిషన్ లో పేర్కొన్నారు. ఆస్తి విషయంలోనే కాకుండా 1000 సవర్ల బంగారు ఆభరణాలు 500 కిలోల వెండి ఆభరణాలను కూడా తమ సోదరులు ప్రభు రామ్ కుమార్ అపహరణ చేశారంటూ వీరు కోర్టులో తమ సోదరులపై పిటిషన్ దాఖలు చేశారు. శాంతి థియేటర్లో 82 కోట్ల విలువైన వాటాలను తమ పేరుపై మార్చుకొని మోసం చేశారని పేర్కొన్నారు. తమ తండ్రి రాసినట్టు చెబుతున్న వీలునామా నకిలీదని పేర్కొన్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారంటూ వీరు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా శివాజీ గణేషన్ కుటుంబం ప్రస్తుతం ఆస్తి తగాదాలతో సోషల్ మీడియా వార్తల్లో నిలిచింది
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…