Featured

Kiraak RP: కిరాక్ ఆర్పీకి కాబోయే భార్య ఎంత కట్న కానుకలు ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Kiraak RP: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది విపరీతమైన పాపులారిటీ సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో కొందరు సినిమాలలో కమెడియన్స్ గా నటించగా మరికొందరి హీరోగా అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కమెడియన్ కిరాక్ ఆర్పీ ఒకరు.

Kiraak RP: కిరాక్ ఆర్పీకి కాబోయే భార్య ఎంత కట్న కానుకలు ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఆర్పీ కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇకపోతే ఆర్పీ మెగా బ్రదర్ నాగబాబుకు పెద్ద అభిమాని అనే విషయాన్ని బయటపెట్టారు. ఏకంగా తన గుండెల పై నాగబాబు పేరును టాటూగా వేయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

Kiraak RP: కిరాక్ ఆర్పీకి కాబోయే భార్య ఎంత కట్న కానుకలు ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ విధంగా నాగబాబుకు అభిమానిగా ఉన్నటువంటి ఆర్పీ గత బుల్లితెర కార్యక్రమంలో తన కాబోయే అమ్మాయి లక్ష్మీప్రసన్నతో తన పరిచయం ఎలా ఏర్పడింది తన ప్రేమ పెళ్లికి ఎలా కష్టాలను పడ్డారనే విషయాలను బయటపెట్టారు. తాను సినిమా ఇండస్ట్రీలో ఉంటానని తనకు లక్ష్మీప్రసన్నని ఇచ్చి పెళ్లి చేయడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఏకంగా కాళ్లు పట్టుకున్నారని డాన్స్ పెర్ఫార్మెన్స్ ద్వార తెలియజేశారు.

ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు…

ఇకపోతే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతుండగా ప్రస్తుతం ఆర్పీ తనకు కాబోయే భార్య లక్ష్మీ ప్రసన్న నుంచి ఎంత మొత్తంలో కట్న కానుకలు తీసుకున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.ఇక లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులను నిశ్చితార్థానికి ఒప్పించిన తర్వాత నిశ్చితార్థానికి అయ్యే ఖర్చులు వారు కూడా భరిస్తామని చెప్పారు కానీ నేను అందుకు ఒప్పుకోలేదు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నాను. అలాగే పెళ్లికి కానుకగా వారు ఒక ఫ్లాట్ ఇస్తామని చెప్పారు. దానిని కూడా రిజెక్ట్ చేసానని,పెళ్లి చేసుకొని అమ్మాయి ఇచ్చే కట్న కానుకలతో బ్రతకడం తనకు ఇష్టం లేదని అలా కట్నకానుకలు తీసుకోవడం, అలా తీసుకున్న వారు కూడా నాకు నచ్చరు అంటూ ఈ సందర్భంగా ఆయన ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago