Featured

Shivaji Ganesan: శివాజీ గణేషన్ కుటుంబంలో ఆస్తి వివాదం.. నటుడు ప్రభు పై ఫిర్యాదు చేసిన శివాజీ కూతుర్లు?

Shivaji Ganesan: ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీని శాసించిన దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈయన తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాజీ గణేషన్ మరణించి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది.

Shivaji Ganesan: శివాజీ గణేషన్ కుటుంబంలో ఆస్తి వివాదం.. నటుడు ప్రభు పై ఫిర్యాదు చేసిన శివాజీ కూతుర్లు?

ఇకపోతే శివాజీ గణేషన్ వారసులుగా ఇండస్ట్రీలోకి హీరో ప్రభు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అలాగే మరొక కుమారుడు రామ్ కుమార్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా శివాజీ గణేష్ వారసులుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుటుంబంలో ప్రస్తుతం ఆస్తి వివాదాలు చెలరేగాయి.

Shivaji Ganesan: శివాజీ గణేషన్ కుటుంబంలో ఆస్తి వివాదం.. నటుడు ప్రభు పై ఫిర్యాదు చేసిన శివాజీ కూతుర్లు?

శివాజీ గణేషన్ మరణించి రెండు దశాబ్దాలు అయిన తరువాత ఈ విధంగా ఈ కుటుంబంలో ఆస్తి వివాదాలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తమకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తులను ఇవ్వకుండా మోసం చేశారని శివాజీ కూతుర్లు శాంతి, రాజ్వీ తన సోదరులు ప్రభు రామ్ కుమార్ లపై ఫిర్యాదు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.తమ తండ్రి మరణం తర్వాత ఏకంగా 271 కోట్ల రూపాయల ఆస్తులను సరిగా పంచకుండా అన్యాయం చేశారని వీరు ఆరోపించారు.

నకిలీ వీలునామాలు రాసి మోసం చేశారు…

తమకు తెలియకుండానే కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకున్నారని అయితే అలా అమ్ముకోవడం చెల్లదని కోర్టు ప్రకటించాలి అంటూ వీరి పిటిషన్ లో పేర్కొన్నారు. ఆస్తి విషయంలోనే కాకుండా 1000 సవర్ల బంగారు ఆభరణాలు 500 కిలోల వెండి ఆభరణాలను కూడా తమ సోదరులు ప్రభు రామ్ కుమార్ అపహరణ చేశారంటూ వీరు కోర్టులో తమ సోదరులపై పిటిషన్ దాఖలు చేశారు. శాంతి థియేటర్లో 82 కోట్ల విలువైన వాటాలను తమ పేరుపై మార్చుకొని మోసం చేశారని పేర్కొన్నారు. తమ తండ్రి రాసినట్టు చెబుతున్న వీలునామా నకిలీదని పేర్కొన్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారంటూ వీరు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా శివాజీ గణేషన్ కుటుంబం ప్రస్తుతం ఆస్తి తగాదాలతో సోషల్ మీడియా వార్తల్లో నిలిచింది

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago