Pulsar bike song Jhansi : ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ప్రతిసారి కొత్తవాళ్ళను తీసుకుని వచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే ఈసారి కూడా పల్సర్ బైక్ అనే జానపద గీతానికి స్టెప్పులతో ఆదరగొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయింది గాజువాక డిపో కండక్టర్ ఝాన్సీ. ఆమె డాన్స్ కి సంబందించిన వీడియో బాగా పాపులర్ అయింది. ఇక చాలా యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలంటూ బిజీ అయిపోయారు ఝాన్సీ. ఇక ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు అన్నింటి గురించి ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. తన భర్త తాను డాన్సర్ అవ్వడానికి ఎంతో ప్రోత్సహించాడని పలు ఇంటర్వ్యూ ల్లో చెప్పింది.
నాపై నా భర్త పై ట్రోల్స్ ఎక్కువయ్యాయి…
తండ్రి వదిలేస్తే తల్లి కష్టపడి ఝాన్సీ ని తన తమ్ముడిని పెంచిందని, డాన్స్ చేసి చిన్న వయసులోనే ఇంటిబాధ్యత తీసుకున్న ఝాన్సీ ఇంటర్ చదివే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక తన భర్త కూడా తనతో పాటు డాన్సర్ అవడం ఎన్నో స్టేజి షోలలో తనకు సపోర్ట్ గా బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా కూడా చేసాడట. అయితే ఇప్పుడు ఒక్కసారిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తో ఫేమస్ అయిన ఝాన్సీ కి ఎంతో మంది అభిమానులు అయ్యారు. అయితే అభిమానులతో పాటు ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ ను కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని ఝాన్సీ ఆవేదణ చెందుతోంది.
డాన్స్ చేసిన వీడియోస్ కింద పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగెటివ్స్ కామెంట్స్ కూడా ఉన్నాయని ఆదీ కాక నా భర్తను కూడా బూతులు తిడుతున్నారని బాధపడింది. గురుపూజ్యోత్సవం సందర్బంగా ఝాన్సీ వారి గురువు రమేష్ గారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ దవి డ్రామా కంపెనీ ద్వారా ఇంత మంచిపేరు వచ్చినందుకు ఆనందంగా ఉంది అని చెబుతూ నెగటివ్ కామెంట్స్ గురించి స్పందించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…