Featured

Punch Prasad : కంట తడి పెట్టుకున్న పంచ్ ప్రసాద్ భార్య… పడిన కష్టాలు తలుచుకుని ఎమోషనల్..!

Punch prasad : ఈటీవీ లో వచ్చే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఈ రెండూ పాపులర్ షోలు. ఎన్ని కామెడీ షోలు ఎన్ని ఛానెల్స్ లో వచ్చిన ఈ షోకి మాత్రం ఇమేజ్ డామేజ్ కావడం లేదు. ఇక ఇందులో కమెడియన్స్ వస్తున్నారు, పోతున్నారు కానీ షో మాత్రం అలానే ఉంది. ఇక ఈ షో తరవాత ఈటీవీ లో బాగా ఫేమస్ అయిన షో శ్రీదేవి డ్రామా కంపెనీ. సుధీర్ హోస్ట్ గా మొదలయిన ఈ షో ఇప్పుడు రష్మీ హోస్ట్ గా పూర్ణ జడ్జి గా కొనసాగుతోంది. ఇక 100 ఎపిసోడ్ చేరువవుతున్న ఈ షోలో ప్రతి వారం కొత్త కాన్సెప్ట్ తో కమెడియన్స్ అలరిస్తారు. ఇక ఈ వారం జోడి నెంబర్ 1 అనే కాన్సెప్ట్ తో వస్తున్నారు.

పంచ్ ప్రసాద్ మీద స్కిట్స్ అందరూ ఎమోషనల్…

ఇక జోడి నెంబర్ 1 లో ప్రతి ఒక్కరూ తమ జోడితో రీల్ లైఫ్ లేదా రియల్ లైఫ్ జోడీస్ తో కనువిందు చేసారు. రామ్ ప్రసాద్, ఆది ఇద్దరూ ఒక్కో అమ్మాయితో కనువిందు చేయగా పంచ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్ నిజ జీవిత జంటలతో కనువిందు చేసారు. రాకింగ్ రాకేష్, సుజాత డాన్స్ తో అదరగోడితే ఇక పంచ్ ప్రసాద్ అతని భార్య వారి రియల్ లైఫ్ లో కష్టాలను స్కిట్ రూపంలో చూపించారు. అయితే వారి స్కిట్స్ అప్పుడు పంచ్ ప్రసాద్ భార్య చాలా ఎమోషనల్ అయ్యారు. ఒక్కసారిగా శ్రీ దేవి డ్రామా కంపెనీ సెట్లో అంతా ఎమోషనల్ అయింది. అందరినీ కడుపుబ్బ తన పంచులతో నవ్వించే పంచ్ ప్రసాద్ నిజానికి మూత్రపిండాలకు సంబంధిచిన వ్యాధితో బాధపడి ఆ చికిత్స కోసం డబ్బులను జబర్దస్త్ వాళ్ళు సహాయం చేసిన సంగతి తెలిసిందే.

అదీకాక పంచ్ ప్రసాద్ కు డయాలసిస్ చేయాల్సిన సమయంలో భార్య గర్భవతి కావడంతో అప్పుడున్న జబర్దస్త్ జడ్జి నాగబాబు, రోజా గారు మిగిలిన కమెడియన్స్ తో కలిసి డబ్బులను వసూలు చేసి వారి కుటుంబానికి ఇచ్చారు. ఇదంతా గతంలో జరిగిన విషయం అయినా మరోసారి స్కిట్లో వారి బాధను చూపించడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. పంచ్ ప్రసాద్ భార్య ఇంత బాధను భరించిందా అంటూ ప్రోమో చూసిన నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago