Punch Prasad: బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి అందరికీ తెలిసిందే. ఇలా పంచ్ ప్రసాద్ తన కామెడీతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. అందరిని ఎంతగానో నవ్వించే ప్రసాద్ జీవితంలో ఎంతో విషాదం ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఈయన గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధి సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే నిత్యం మందులు వాడుతూనే ఈయన బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించిపోయింది. ఈయన నడవలేని స్థితిలోకి కూడా వెళ్లిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న ప్రసాద్ కి తాను సర్జరీ చేయిస్తానని ఆర్పి మాట ఇచ్చారు.
ఇప్పుడిప్పుడే తన అనారోగ్య పరిస్థితుల నుంచి కోలుకుంటున్న ప్రసాద్ తిరిగి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసాద్ తన భార్య పిల్లలతో కలిసి తన సొంతూరికి వెళ్లారు.ఈ క్రమంలోనే ప్రసాద్ తన సొంత ఊరిలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించిన వీడియోని హోమ్ టూర్ వీడియోగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసారు.
ప్రస్తుతం ప్రసాద్ హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా తన హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉందని పై పోషన్లో తన తల్లి ఉంటుందని కింద తన పిన్ని ఉంటుందని తెలిపారు. తన పిన్ని తన తల్లికి సొంత చెల్లెలు కావడంతో ఇప్పటివరకు రూపాయి కూడా రెంట్ ఇవ్వలేదని తన అమ్మ తన చెల్లిని వదిలి ఉండలేదని తెలిపారు. ఇక ఈ ఇంట్లో ప్రసాద్ సాధించిన గిఫ్ట్ లన్నింటినీ కూడా చూపించారు. ఇక వీరి ఇల్లంతా కూడా రంగురంగు ముగ్గులతో ఎంతో అందంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…