Puri Jagannath : టాలీవుడ్ లో ఏంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన దర్శకులలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. ఈయన గురించి ఈయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్, రవితేజ లకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ‘బద్రి’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనడడంలో అతిషయోక్తి లేదు. ఇక 2006 లో వచ్చిన ‘పోకిరి’ అయితే మహేష్ ఇమేజ్ ని మార్చడమే కాకుండా ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఇక రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘ఇడియట్’ సినిమా కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినదే. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, టెంపర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలని ఇండస్ట్రీకి ఇచ్చారు.
లైగర్ దెబ్బకు ఇల్లు వదిలి వెళ్లి…
అయితే ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించిన పూరీ ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో ఎలా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఇటీవల ఆయన సొంత బ్యానర్లో, ఆయన దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఆయన కెరీర్ లోనే చెత్త సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. దీని తరువాత తీయాల్సిన ‘జనగణమన’ కూడా ఆగిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనను ఇన్నాళ్లు అభిమానించిన వాళ్ళు కూడా భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో ఇల్లు దాటి బయటకు రాకుండా ఉన్నారు.
ఈక్రమంలో మరో హిట్ సినిమా కొట్టాలని సొంత కొడుకు ఆకాష్ పూరీ తో డిఫరెంట్ స్టోరీని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఇందులో భాగంగా ఒక మంచి కథ రాయాలని ఇల్లు వదిలి వెళ్లారట. గోవా వెళ్లి మూడునెలలో మంచి కథ రాసుకొని వస్తాను అని చెప్పి మరి వెళ్లారట. ప్రస్తుతం అయితే పూరీ గోవాలో స్టోరీ పనిలో బిజీ గా ఉన్నారు. అంతే కాకుండా త్వరలోనే కొడుకుతో తీసే సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉందట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…