Senior Journalist Bhardwaja : అక్కినేని నాగేశ్వరావు గారు, నందమూరి తారక రామారావు గారు ఇద్దరికీ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి హిట్స్ ఇచ్చిన ఒకేఒక దర్శకుడు దాసరి నారాయణ రావు గారు. అటు ఎన్టీఆర్ తో సర్ధార్ పాపారాయుడు, బొబ్బిలి సింహం వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దాసరి ఇక ఏఎన్ఆర్ తో ఏడంతస్థుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, మేఘ సందేశం వంటి సూపర్ హిట్లు ఇచ్చారు. ఇక ఒకరకంగా అక్కినేని వారు ఫ్లాపులతో సతమవుతున్న సమయంలో ఒక మంచి హిట్ ఇచ్చి అక్కినేని అభిమానులకు ఊరటనిచ్చారు.
వాళ్ళ మధ్య అందుకే విభేదాలు…
ఇక ఏఎన్ఆర్, దాసరి మధ్య అనుబంధం, విబేధాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు. ఇక మళ్ళీ ఏఎన్ఆర్ తో వరుస హిట్లు కొట్టిన దాసరి ఇక ఒకవైపు తెలుగులో హిట్లు కొడుతూ హిందీలో ఈ సినిమాలను రీమేక్ చేసి అక్కడ హిట్లు కొట్టారు. ఇక ఫుల్ బిజీ షెడ్యూల్ తో పనిచేస్తున్న సమయంలో దాసరి గారు అన్నపూర్ణ స్టూడియోలోనే పడుకునే వారు. అదీకాక హిందీ సినిమాలను కూడా అన్నపూర్ణ లో ఎక్కువగా తీసేవారు, అయితే కొన్నిసార్లు కొంతమంది ప్రొడ్యూసర్లకు పూచికత్తు ఉండటం వల్ల స్టూడియోకి బకాయి పడటం అది తీర్చలేక పోవడం వల్ల ఆయన అన్నపూర్ణ నుండి బయటికి రావాల్సి రావడంతో అక్కినేని తో విబేధాలు వచ్చాయి. ఇక నాగేశ్వరావు గారు దాసరి తో ఎక్కువ కలవడం, మాట్లాడటం చేయలేదు.
కానీ దాసరి గారు అప్పటికి తన అభిమాన నటుడు ఎవరు అంటే నాగేశ్వరావు గారి పేరు చెప్పేవారు. ఇక నాగార్జున తో ‘మజ్ను’ వంటి సినిమాలను చేసారు. ఇక ‘ఢమరుకం’ సినిమా సమయంలో విడుదల సమస్యలు ఉంటే నాగార్జున అడగటం తో దాసరి తన సిరి మీడియా సంస్థ ద్వారా విడుదల అడ్డంకిని తీర్చారు. అయినప్పటికీ ఆ ఫ్యామిలీ కి దూరంగానే ఉన్నారు దాసరి, ఇక తన జీవితంలోని విషయాల గురించి పుస్తకం రాయాలనే కోరిక ఉండేది, ఒక సందర్బంలో ఆ విషయం చెబుతూ రాస్తే స్టూడియో నుండి నన్ను గేంటేసిన విషయం లాంటివి చెప్పాల్సి వస్తుందని చెప్పారు అంటూ ఏఎన్ఆర్, దాసరి మధ్య ఉన్న విభేదాలను చెప్పారు భరద్వాజ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…