Featured

Puri Jagannath : పూరీ జగన్నాథ్, ఛార్మి మధ్య ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన పూరీ… ఎన్నో ఏళ్లుగా కలిసి ట్రావెల్ చేస్తున్నాం అంటూ కామెంట్స్..!

Puri Jagannath : లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న పూరి జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ చాలా విషయాల గురించి చర్చించారు. ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఇక చాలా రోజుల నుండి ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట పూరి జగన్నాథ్, ఛార్మి మధ్య ఏదో ఉంది అని అందుకే పూరి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసాడు అని. ఇక దీనికి బలాన్ని చేకూరుస్తూ ఇటీవల పూరి తన కొడుకు హీరో గా వచ్చిన సినిమా ఈవెంట్ కు రాకపోవడంతో ఈ అనుమానం మరింత బలపడింది.

మ మధ్య ఉన్నది స్నేహమే.. అఫైర్ కాదు…

పూరి జగన్నాథ్ ఛార్మి మధ్య ఎఫైర్ ఉంది అందుకే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోలేదు అనే మాటలు వినిపించాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ పూరి జగన్నాథ్ లైగర్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడారు. ఒక క్లారిటీ ఇచ్చారు వారి రిలేషన్ గురించి. ఛార్మి పదమూడేళ్ల వయసుకే ఇండస్ట్రీ కి వచ్చింది. అప్పటి నుండి తనతో నా ప్రయాణం సాగుతోంది. ఎప్పటి నుండో ఛార్మి తో పరిచయం స్నేహం ఉన్నాయి. మా మధ్య ఉండేది ఎఫైర్ అయితే అది ఎంతో కాలం నిలబడదు, ఆకర్షణ ఎక్కువ కాలం ఉండదు.

మాది స్నేహం ఎవరు ఏమనుకున్నా మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే. ఛార్మి కి పెళ్ళై ఉన్నా, లేక ఛార్మి కి ఒక యాభై ఏళ్ళు ఉండి ఉన్నా ఇలాంటి వార్తలు మా గురించి వచ్చేవి కాదు అంటూ పూరి మాది స్నేహం అంటూ క్లారిటీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి పూరి కనెక్ట్స్ అనే కంపెనీ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. జ్యోతిలక్ష్మి సినిమా సమయం నుండే ఛార్మి నిర్మాత గా మారి సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. అలా వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ మంచి విజయం అందుకుంది.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

2 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

2 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

2 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

2 hours ago