Movie News

Senior NTR : ఐదు రూపాయల కోసం సావిత్రి ఇంటికి వెళ్లి అడిగిన అన్నగారు..జోకులేసిన జగ్గయ్య గారు…!

Senior NTR : విశ్వ విఖ్యతగా తెలుగు జాతి వందేళ్లు గుర్తుపెట్టుకునే నటుడు నందమూరి తారకరామారావు గారు. ఏడు కోట్ల ఆంధ్రుల హృదయాల్లో ఉన్న ఆయన ఐదు రూపాయల కోసం సావిత్రి ఇంటికి వెళ్లాడంటే నమ్మకం కుదరదు ఇది పుకారు అనిపిస్తుంది. కానీ అది నిజం. క్రమశిక్షణకు ఎన్టీఆర్ పెట్టింది పేరు అలాగే మహా పిసినారి అనే మాట కూడా ఆయనతో సన్నిహితంగా ఉండేవారు చెప్పే మాట. అయన సినిమాల్లో నెంబర్ వన్ అయినా, రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి రూపాయి చూసుకునే ఖర్చు పెట్టేవారని ఇక తన పిల్లలు ఆయన సీఎం గా ఉన్నపుడు అధికార దూర్వినియోగానికి పాల్పడకూడదని జాగ్రతగా ఉండేవారు. అలాంటి వ్యక్తి ఐదు రూపాయల కోసం సావిత్రి గారి ఇంటికి వెళ్లారట.

చేతిలో ఖర్చులకు డబ్బు లేకపోవడం తో సావిత్రి వద్దకు డబ్బు కోసం…

అప్పట్లో సినిమా నిర్మాణం ఇలా ఉండేది కాదు. నెలవారి జీతాలకు సినిమాల్లో పని చేసేవారు. ఒక కంపెనీ లో సినిమాలకు పని చేస్తూ నెల నెల జీతం తీసుకునే వారు ఆర్టిస్టులు. అలా విజయా కంపెనీలో పనిచేసేవారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు వంటి వారు. అలా మిస్సమ్మ సినిమాలో కలిసి పనిచేసిన సమయంలో నెల జీతాలు కదా అందరిని పంచుకోమని చెక్ అన్నగారికి ఇచ్చారట. అప్పట్లో నెల వారి జీతాలు అన్న గారికి 75 రూపాయలు, రేలంగికి 55 రూపాయ‌లు , సావిత్రికి 70 రూపాయ‌లు, జ‌మున‌కు 45 రూపాయ‌లు, అక్కినేనికి 30 రూపాయ‌లు ఇచ్చారు. అయితే మొత్తం చెక్ రూపంలో ఇచ్చి పంచుకోమనంగా రేలంగి, ఏఎన్ఆర్, జమున వారి డబ్బు గ్రూప్ గా తీసుకుని వెళ్లిపోయారు.

ఇక సావిత్రి గారిది అన్నగారిది పంచుకోవాల్సి రావడం తో సావిత్రి గారు తన వాటా తో పాటు ఐదు రూపాయిలు ఎక్కువ తీసుకుని రేపు షూటింగ్ వచ్చినపుడు ఇస్తానని చెప్పారట. అయితే ఒక నెల వరకు సావిత్రి  గారికి షూటింగ్ లేదు వేరే సినిమాలో బిజీగా ఉన్నారు. ఇక మరుసటి రోజు ఊర్లో కుటుంబానికి ఖర్చులకు డబ్బు పంపి, మద్రాస్ లో రూమ్ రెంట్ కట్టి అన్ని ఖర్చులు పోగా చేతిలో ఏమి మిగలేదు అన్నగారికి దీంతో సిగరెట్ కి చిన్న చిన్న ఖర్చులకు డబ్బు లేక పోవడంతో చేసేదేమి లేక సావిత్రిగారి రూమ్ దగ్గరికి వెళ్లి తన ఐదు రూపాయలు ఇబ్బంది పడుతూనే అడిగేసారట. ఇక ఈవిషయాన్ని చాలా సార్లు జగ్గయ్య గారు జోకులేసేవారట. అన్నగారాంతటి వారికే ఐదు రూపాయల తిప్పలు తప్పలేదు అంటూ అనే వారట.

Bhargavi

Recent Posts

బ్రౌన్ షుగర్ నిజంగా హెల్తీనా? తెల్ల చక్కెరతో పోలిస్తే అసలు తేడా ఇదే!

ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మనం తినే ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించే అలవాటు పెరిగింది. ముఖ్యంగా చక్కెర…

34 seconds ago

రుచికోసం రిస్క్ తీసుకుంటున్నారా? చికెన్‌లో తప్పక దూరంగా ఉండాల్సిన భాగాలు!

చికెన్ అనేది భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ లభించడంతో చాలామంది వారానికి పలుమార్లు…

5 minutes ago

గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదే… కానీ ఎంత వరకు? తెలుసుకోవాల్సిన ముఖ్య సూచనలు

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…

3 hours ago

రోజూ గుడ్డు తింటే పిల్లలకు ఏమవుతుంది? తల్లిదండ్రులకు కీలక సూచనలు!

పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…

3 hours ago

మందులు అవసరం లేదు! రోజుకు ఒక చెంచా ఈ గింజలు చాలు – శరీరానికి ఫుల్ పవర్!

ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…

3 hours ago

జేబులో గుట్కా ఉందా? తెలియకుండానే మృత్యువుకు దగ్గరవుతున్నారా!

భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…

4 hours ago